అక్రమ రవాణాను సహించం

Wed,March 20, 2019 01:25 AM

-అదుపులో పది మంది అనుమానితులు
-ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి
-పట్టణంలోని 8 కాలనీల్లో కార్డన్ సెర్చ్
మహబూబాబాద్, నమస్తే తెలంగాణ, మార్చి 19 : అక్రమ రవాణా, తరలింపులను సహించేదిలేదని జిల్లా ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి అన్నారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో మంగళవారం మహబూబాబాద్ పట్టణంలోని ఎనిమిది కాలనీల్లో కార్డన్‌సెర్చ్ నిర్వహించినట్లు ఎస్పీ తెలి పారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా పట్టణంలో కార్డన్ సెర్చ్ నిర్వహిస్తున్నామన్నారు. ఉదయాన్నే ఇందిరానగర్ కాలనీ, జగన్ కాలనీ, ధర్మన్న కాలనీ, సిగ్నల్ కాలనీ, కృష్ణానగర్ కాలనీ, నందమూరి నగర్ కాలనీ, భద్రన్న కాలనీ, బాబాగుట్ట కాలనీల్లో మహబూబాబాద్ డీఎస్పీ ఆధ్వర్యంలో ఉదయం 4 నుంచి 7 గంటల వరకు తనిఖీలు నిర్వహించినట్లు చెప్పా రు. బెల్ట్‌షాపుల్లో రూ.20 వేల మద్యం, పది టేకు దుంగ లు, నెంబర్లు, కాగితాలు లేని 20 ద్విచక్రవాహనాలు, వెయ్యి గుట్కాప్యాకెట్లు, మూడు ఇసుక ట్రాక్టర్లు, 50 లీటర్ల కిరోసిన్‌తో పాటు రూ. 2 లక్షల విలువ గల సొత్తు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. పది మంది అనుమానితులను అ దుపులోకి తీసుకున్నామని ఎస్పీ వెల్లడించారు. ఇసుక అక్రమ రవాణాపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. కార్డన్ సెర్చ్‌లో 120 మంది పోలీసులు, సీఆర్‌పీఎఫ్, ఐటీబీపీ, టీఎస్‌ఎస్‌పీ, స్పెషల్ పార్టీ పోలీసులు పాల్గొన్నారు.

47
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles