అంగన్‌వాడీ కేంద్రాన్ని తనిఖీ చేసిన సీడీపీవో

Wed,March 20, 2019 01:24 AM

-విధుల్లో నిర్లక్ష్యం వహిస్తున్న వారిపై ఆగ్రహం
-ఇద్దరు టీచర్లు, ఒక ఆయా నెల వేతనం నిలుపుదల
దంతాలపల్లి, మార్చి 19: పద్ధతి మార్చుకోమని చెప్పినా వినకుండా, విధుల్లో నిర్లక్ష్యం వహిస్తున్న ఇద్దరు అంగన్‌వాడీ టీచర్లు, ఓ ఆయాలకు వారి నెల జీతం నిలుపుదల చేసినట్లు సీడీపీవో కోనె శిరీష తెలిపారు. మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాల ఆవరణలో నిర్వహిస్తున్న రెండో, నాల్గవ అంగన్వాడీ సెంటర్లను మంగళవారం ఐసీడీఎస్ సూపర్‌వైజర్ ఆర్ సుధ తనిఖీ చేశారు. గతంలో ఇదే సెంటర్‌లో ఓ బాలుడు ఆడుకుంటూ, పాలు కాగుతున్న గిన్నెకు తగలడంతో వేడిపాలు మీదపడి తీవ్ర గాయాలయ్యాయి. కాగా ఆ సంఘటనలో నిర్లక్ష్యం వహించిన ఓ ఆయాను అధికారులు సస్పెండ్ చేశారు. ఆ తర్వాత ఈ రెండు సెంటర్ల పిల్లలకు ఒకే ఆయా వండటం, పిల్లలను ఆడిస్తోంది. అయితే గత సంఘటనల దృష్ట్యా రెండు సెంటర్ల పిల్లలకు వేర్వేరు వంటలు చేస్తే స్థలం సరిపోదని ఒకే దగ్గర వంట చేయాలని పలుమార్లు సూపర్‌వైజర్ సుధ వారికి సూచించినట్లు ఆమె తెలిపారు. అయినప్పటికీ వారు నిర్లక్ష్యం వహిస్తూ మంగళవారం కూడా అదేవిధంగా చేయడంతో గమనించిన సూపర్‌వైజర్ వెంటనే సీడీపీవో శిరీషకు ఫిర్యాదు చేసింది. వెంటనే ఆ సెంటర్‌ను తనిఖీ చేసిన సీడీపీవో అక్కడి పరిస్థితులు విచారించి, వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

తీరు మార్చుకున్నాకే వేతనం చెల్లింపు
ఈ సందర్భంగా సీడీపీవో శిరీష మాట్లాడుతూ.. రెండు వేర్వేరు పొయ్యిలు గదిలో పెట్టి వంట చేయడం కాకుండా, ఒకే పొయ్యి మీద వంట చేయాలని ఆదేశించారు. సెంటర్‌లో పరిశుభ్రత సరిగా లేకపోవడంతో పిల్లలకు జబ్బులు వచ్చే ప్రమాదం ఉందని, పరిశుభ్రత పాటించాలని అన్నారు. అలాగే బాలింతలకు, గర్భిణులకు సెంటర్ వద్ద మాత్రమే పాలు, గుడ్డు, బాలామృతం అందించాలి తప్ప, వారి ఇళ్లకు తీసుకెళ్లి తినేందుకు ఇవ్వొద్దని, దీనిని తీవ్రంగా పరిగణిస్తామని ఆమె తెలిపారు. తీరు మార్చుకున్నాకే వారికి వేతనం చెల్లించాలని సూపర్‌వైజర్‌కు సూచించారు. మరో వారం రోజుల్లో తాను మళ్లీ కేంద్రాన్ని సందర్శించి, పరిస్థితి మార్చుకుంటేనే జీతం విడుదల చేస్తామని వారిని హెచ్చరించారు.

37
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles