సీ-విజల్‌పై విద్యార్థులకు అవగాహన సదస్సు

Tue,March 19, 2019 02:32 AM

మహబూబాబాద్, నమస్తే తెలంగాణ, మార్చి 18 : మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని వికాస్ డిగ్రీ కళాశాలలో విద్యార్థిని, విద్యార్థులకు స్వీప్‌లో భాగంగా ఈవీఎం,వీవీప్యాట్లపై అవగాహన సదస్సు నిర్వహించినట్లు స్వీప్ జిల్లా నోడల్ అధికారి కాపారపు శ్రీనివాస్‌రావు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు వారి గ్రామాల్లో ఓటర్లకు ఈవీఎంలపై అపోహలను నివృత్తి చేయాలన్నారు. గత అసెంబ్లీ ఎలక్షన్లలో సుమారు 76 శాతం మంది ఓటర్లకు ఈవీఎం, వీవీప్యాట్లపై అవగాహన కల్పించామన్నారు. అందులో 51 శాతం మంది మాక్ పోలింగ్‌లో పాల్గొన్నారని తెలిపారు. ఈ లోక్‌సభ ఎన్నికల్లో ఈవీఎం, వీవీప్యాట్లపై అవగాహన కోసం 10 ప్రచార రథాలు ఏర్పాటు చేసినట్లు ప్రతి పోలింగ్ స్టేషన్‌లో ప్రణాళికా బద్ధంగా అవగాహన కల్పిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమం పోలింగ్ డే ముందు వరకు కొనసాగుతుందని మొత్తం ఓటర్లలో 90 శాతం ఓటర్లకు ఈవీఎం,వీవీప్యాట్లపై అవగాహన కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. పోటీ చేసే అభ్యర్థులు ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లగించకుండా సీ-విజిల్ యొక్క వినియోగం ఉపయోగంపై అవగాహన కల్పించినట్లు ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధి కల్పనాధికారి, రామకృష్ణ, మహబూబాబాద్ కళాశాలల కరస్పాండెంట్, ప్రిన్సిపాళ్లు పాల్గొన్నారు.

55
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles