ఎన్డీ డివిజన్ కార్యదర్శి విక్రం అరెస్టు

Tue,March 19, 2019 02:31 AM

-తపంచా,10 తూటాలు, విప్లవ సాహిత్యం స్వాధీనం
-విలేకరుల సమావేశంలో ఎస్పీ వెల్లడి
గూడూరు, మార్చి18: న్యూడెమోక్రసీ అజ్ఞాతదళ మహబూబాబాద్ జిల్లా కమిటీ సభ్యుడు, గూడూరు డివిజన్ కార్యదర్శి విక్రం అలియాస్ పెనక వెంకన్నను అరెస్టు చేసి రిమాండ్‌కు పంపుతున్నట్లు ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి వెల్లడించారు. స్థానిక పోలీస్ స్టేషన్‌లో సోమవారం ఆయన విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. అజ్ఞాత ఎన్డీ దళానికి చెందిన విక్రం అనేక చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు ప్పాలడుతుండగా తమ సిబ్బంది చాకచక్యంగా పట్టుకున్నారని తెలిపారు. విక్రం మండలంలోని జగన్నాయకులగూడేనికి చెంది న వాడని, చిన్నతనంలో అజ్ఞాత దళ నాయకులతో ఏర్పడిన పరిచయాలతో వారి భావాలకు ఆకర్షితుడై 1990లో చిన్న చంద్రన్న అజ్ఞాతదళంలో చేరాడని ఎస్పీ తెలిపారు. 1991లో అజ్ఞాతం నుంచి బయటికి వచ్చిచ గూడూరులో ఎన్టీ పార్టీకి చెందిన లీగల్ కార్యక్రమాలు చూసేవాడని తెలిపారు. 2001లో ఇదే పార్టీ నుంచి అప్పరాజుపల్లి ఎంపీటీసీగా గెలిచి పదవీకాలం తరువాత 2005లో ప్రజాప్రతిఘటన పార్టీలో విభేదాలు రావడంతో చిన్న చంద్రన్న దళంలో చేరాడని చెప్పారు.

ఆరు నెలల తరువాత పోలీసుకు లొంగిపోయి తిరిగి లీగల్ కార్యక్రమాలు చూశాడని వివరించారు. 2013లో అక్రమదందా విషయంలో ఎన్డీ పార్టీలో రెండు వర్గాలు ఏర్పడగా రాయలవర్గం నేత చిన్న చంద్రన్న దళంలో చేరి దళ కమాండర్‌గా వరంగల్, మహబూబాబాద్ ఏరియాల్లో తిరగుతూ పార్టీ అవరసరాల నిమిత్తం కాంట్రాక్టర్లను, వ్యాపారులను బెదిరిండని ఈ సంఘటనలలో మహబూబాబాద్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు అయిందని ఎస్పీ తెలిపారు. 2016లో గూడూరులోని వ్యాపారులు, కాంట్రాక్టర్లను బెదిరించి వారి వద్ద డబ్బులు వసూలు చేస్తున్న క్రమంలో మచ్చర్ల గ్రామంలో అరెస్టు చేసి కోర్టుకు పంపగా బెయిల్‌పై విడుదలై మళ్లీ కొంతమంది సానుభూతిపరులతో కలిసి పోడు భూమలు విషయంలో సమావేశాలు నిర్వహించి ప్రభుత్వం పై ఒత్తిడి పెంచేలా సానుభూతిపరులను పురిగొల్పాడని ఎస్పీ తెలిపారు.

2018లో గోపన్నను మహబూబాబాద్ పోలీసులు అరెస్టు చేయడంతో ఎన్డీ లీగల్ నాయకులతో కార్యకర్తలతో సమావేశం పెట్టి పార్టీ బలోపేతానికి కృషి చేశాడని చెప్పారు. కాగా సోమవారం ఎవరికీ అనుమానం రాకుండా చందలా వసూలు నిమిత్తం బ్యాగులో తుపాకీ పెట్టుకుని మండలంలోని పొట్లంపాడు తండా నుంచి మహబూబాబాద్‌కు వెలుతుండగా గూడూరు ఎస్సై యాసిన్, కొత్తగూడెం ఎస్సై తాహెర్‌బాబా సిబ్బందితో కలిసి విక్రంను పట్టుకున్నట్లు చెప్పారు. ఒక తపంచా, పది తూటాలు, విప్లవ సాహిత్యాన్ని స్వాధీనం చేసుకున్నారని, విక్రంను కోర్డుకు హాజరు పరుచనున్నట్లు ఎస్పీ తెలిపారు. ఈ సమావేశంలో అడిషనల్ ఎస్పీ గిరిధర్‌రావు, డీఎస్పీ నరేశ్‌కుమార్, సీఐ బాలాజీనాయక్, ఎస్సైలు యాసీన్, తాహెర్‌బాబా, సిబ్బంది పాల్గొన్నారు.

37
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles