ఎన్నికల వ్యయ పరిశీలకుల నియామకం

Tue,March 19, 2019 02:31 AM

-స్వాగతంపలికిన కలెక్టర్ శివలింగయ్య
మహబూబాబాద్, నమస్తే తెలంగాణ, మార్చి 18 : లోక్‌సభ ఎన్నికల నిర్వహణ, అభ్యర్థుల వ్యయ నియంత్రణను పర్యవేక్షించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ద్వారా మహబూబాబాద్ లోక్‌సభ నియోజకవర్గానికి సాధారణ వ్యయ పరిశీలకులుగా నియమితులైన ఐఆర్‌ఎస్ అధికారులు ఎంకే శర్మ, నితిన్ జైన్‌ను సోమవారం సాయంత్రం కలెక్టర్ సీహెచ్ శివలింగయ్య స్థానిక రోడ్ల భవనాల శాఖ అతిథి గృహంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఎంకే శర్మ మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలోని మహబూబాబాద్, డోర్నకల్, నర్సంపేట, ములుగు అసెంబ్లీ సెగ్మెంట్లలో ఎన్నికల ప్రక్రియను, అభ్యర్థుల వ్యయ నియంత్రణను పరిశీలిస్తారు. అదే విధంగా నితిన్ జైన్ ఇల్లందు, భద్రాచలం పినపాక అసెంబ్లీ నియోజకవర్గాల్లోని వ్యయ ప్రక్రియను నిశితంగా పరిశీలిస్తారు. ఎన్నికల వ్యయ పరిశీలకుడు ఎంకే శర్మ మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో అందుబాటులో ఉండి అభ్యర్థుల ఖర్చుల నియంత్రనలను పరిశీలిస్తారు.

కాగా నితిన్ జైన్ భద్రాద్రి కొత్తగూడెంలో ఉండి ఇల్లందు, భద్రాద్రి , పినపాక అసెంబ్లీ నియోజక వర్గాల అభ్యర్థుల వ్యయ నియంత్రణను పర్యవేక్షిస్తారు. మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలోని 4 అసెంబ్లీ సెగ్మెంట్లలో ఎన్నికల కోడ్ అమలు, ఖర్చులు, విమర్శలు, ప్రలోభాలు తదితరాలపై గట్టి నిఘా పెంచి వెంటనే చర్యలు తీసుకోనున్నారు. పార్లమెంట్ నియోజకవర్గంలోని 4 అసెంబ్లీ సెగ్మెంట్‌లోని పోటీ చేయనున్న అభ్యర్థుల, రాజకీయ పార్టీలకు సంబంధించిన సాధారణ వ్యయ పరిశీలన నిశితంగాపరిశీలించి నిబంధనలకు అతిక్రమించిన వారిపై చర్యల నిమిత్తం రిటర్నింగ్ అధికారికి ఎప్పటికప్పుడు నివేదిస్తారు. ఏమైనా సమస్యలు, సందేహాలు ఉంటే సాధారణ వ్యయ పరిశీలకులకు వ్యక్తిగతంగా గానీ, సెల్ నంబర్ 80966 22742కు గానీ సంప్రదించవచ్చని ఎంకే శర్మ కోరారు. మంగళవారం వివిధ పార్టీల నాయకులతో, అదేవిధంగా ఎన్నికల నోడల్ అధికారులు, నిఘా బృందాలతో ఆయన సమావేశమవుతారు. ఈ కార్యక్రమంలో జేసీ డేవిడ్, ఆర్డీవోలు కొమురయ్య, ఈశ్వరయ్య, జిల్లా ఎన్నికల వ్యయ నిర్వహణ అధికారి ఇంది, నోడల్ ఆఫీసర్ బాలరాజు, లిజనింగ్ ఆఫీసర్లు తదితరులు పాల్గొన్నారు.

52
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles