నేడు నోటిఫికేషన్ విడుదల

Mon,March 18, 2019 02:07 AM

-ఉదయం 11గంటల నుంచి నామినేషన్ల స్వీకరణ
-25వ తేదీ వరకు చివరి గడువు
-నామినేషన్ల పరిశీలన 26న
-28న ఉప సంహరణ
-ఏప్రిల్ 11న పోలింగ్
-మే 23న ఓట్ల లెక్కింపు
-కలెక్టరేట్‌లో రిటర్నింగ్ అధికారికార్యాలయం
మహబూబాబాద్ జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ: పార్లమెంట్ ఎన్నికలకు అంతా సిద్ధం అయ్యింది. ఎన్నికల నోటిఫికేషన్ నేడు విడుదల చేయనున్నారు. సోమవారం ఉదయం 10.30గంటలకు మహబూబాబాద్ పార్లమెంట్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి సీహెచ్ శివలింగయ్య నోటిఫికేషన్ విడుదల చేస్తారు. 11గంటల నుంచి నామినేషన్లను స్వీకరించనున్నారు. 18నుంచి 25వరకు ఉదయం 11గంటల నుంచి మధ్యాహ్నం 3గంటల వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. 26న నామినేషన్ల పరిశీలిస్తారు. 28న నామినేషన్ల ఉపసంహరణ గడువు ఉంది. అనంతరం పోటీలో ఉన్న అభ్యర్థుల పేర్లను రిటర్నింగ్ అధికారి ప్రకటిస్తారు. ఏప్రిల్ 11న ఎన్నికలు జరుగనున్నాయి. మే23న ఓట్లను లెక్కించనున్నారు. మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో మొత్తం 14,14,210 ఓట్లు ఉన్నాయి. ఇందులో పురుషులు 6,98,325 కాగా, 7,15,848మంది మహిళలు, ఇతరులు 37మంది ఉన్నారు. పార్లమెంట్ పరిధిలో మొత్తం 7అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 42మండలాలు ఉన్నాయి. వీటి పరిధిలో 1735 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఎన్నికల నోటిఫికేషన్ నేడు వెలువడుతుండటంతో అన్ని రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు నామినేషన్లు వేసేందుకు సిద్ధమవుతున్నారు.

మహబూబాబాద్ పార్లమెంట్ ఎన్నికకు సంబంధించి రిటర్నింగ్ కార్యాలయాన్ని జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో ఏర్పాటు చేశారు. సోమవారం నోటిఫికేషన్ వెలువడిన వెంటనే నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. కలెక్టరేట్ కార్యాలయం వద్ద 144సెక్షన్ విధించారు. నామినేషన్ల ప్రక్రియ ముగిసే వరకు ఇది అమలులో ఉండనుంది. నామినేషన్ దాఖలు చేసే సమయంలో అభ్యర్థితో సహా ఐదుగురికి మాత్రమే లోపలికి అనుమతి ఉంటుంది. మిగిలిన వారిని లోపలికి అనుమతించరు. కాగా జిల్లాకు ఇప్పటికే ఈవీఎంలు చేరుకున్నాయి. ఈసీఎల్ కంపెనీకి చెందిన ఈవీఎంలు జిల్లాకు చేరుకున్నాయి. వీటిని మొదటి లెవల్ చెకింగ్ కూడా పూర్తి చేశారు. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన తర్వాత జిల్లా యంత్రాంగం మొత్తం పూర్తి స్థాయిలో ఎన్నికల ఏర్పాట్లపై ఉన్నారు. మహబూబాబాద్ పార్లమెంట్ పరిధిలో మొత్తం 1735పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. ఇందులో 250 క్రిటికల్ పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని అధికారులు గుర్తించారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో ప్రత్యేకంగా నిఘా ఏర్పాటు చేశారు. 10వ తేదీన కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసిన విషయం తెలిసిందే. నేడు ఎన్నికల నోటిఫికేషన్‌ను విడుదల చేసి నామినేషన్ల ప్రక్రియను ప్రారంభించనున్నారు.

నేటి నుంచి 25వరకు నామినేషన్ల స్వీకరణ
కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకారం మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి సోమవారం ఉదయం 10.30గంటల నోటిఫికేషన్ విడుదల చేస్తారు. అనంతరం 11గంటల నుంచి నామినేషన్లను స్వీకరించనున్నారు. 18నుంచి 25వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు. ఆదివారం, ప్రభుత్వ సెలవులు రోజులు మినహాయిస్తే మిగతారోజుల్లో ఉదయం 11గంటల నుంచి మధ్యాహ్నం 3గంటల వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు. 26న నామినేషన్లను పరిశీలిస్తారు. 28న నామినేషన్ల ఉప సంహరణ ఉంటుంది. ఏప్రిల్ 11న ఎన్నికలు నిర్వహించనున్నారు. మే 23 ఎన్నికల ఫలితాలు వెలువడుతాయి. నామినేషన్ల స్వీకరణకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. నామినేషన్లు స్వీకరించే సమయం అనగా ఉదయం 11గంటల నుంచి మధ్యాహ్నం 3గంటల వరకు పోలిసులు కలెక్టరేట్‌లోపలికి ఎవరిని అనుమతించరు. నామినేషన్లు స్వీకరించే సమయంలో అభ్యర్థితో పాటు 5గురు సభ్యులు మాత్రమే కలెక్టరేట్ లోపలికి అనుమతిస్తారు.

రిటర్నింగ్ అధికారి కార్యాలయం ఏర్పాటు
మహబూబాబాద్ పార్లమెంట్ ఎన్నికకు సంబంధించిన నామినేషన్ల ప్రక్రియను కలెక్టరేట్‌లోని రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో ఏర్పాటు చేశారు. కలెక్టరేట్ భవనంలోని సమావేశ మందిరంలో రిటర్నింగ్ అధికారి కార్యాలయం ఏర్పాటు చేశారు. రిటర్నింగ్ అధికారి 18నుంచి 25వరకు ఉదయం 11గంటల నుంచి మధ్యాహ్నం 3గంటల వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు. ములుగు జిల్లాలోని ములుగు, వరంగల్ రూరల్ జిల్లా పరిధిలోని నర్సంపేట నియోజకవర్గం, మహబూబాబాద్ జిల్లాలోని మహబూబాబాద్, డోర్నకల్ నియోజకవర్గాలు, కొత్తగూడెం, భద్రాద్రి జిల్లాలోని ఇల్లందు, పినపాక, భద్రాచలం నియోజకవర్గాలు ఉన్నాయి. వీటి పరిధిలోని నాయకులు నామినేషన్లు వేయాలన్నా జిల్లా కేంద్రంలో కలెక్టరేట్‌కు వచ్చి నామినేషన్ దాఖలు చేయాల్సి ఉంటుంది. పూర్వపు వరంగల్ జిల్లాలో కలెక్టర్ వరంగల్ పార్లమెంట్‌కు, జాయింట్ కలెక్టర్ మహబూబాబాద్ పార్లమెంట్ ఎన్నికల రిటర్నింగ్ అధికారులుగా ఉండేవారు. 2016లో కొత్త జిల్లాలు ఏర్పడిన తర్వాత పార్లమెంట్ ఎన్నికలు మొదటిసారి కొత్తజిల్లాలో నిర్వహిస్తున్నారు. దీంతో మహబూబాబాద్ పార్లమెంట్‌కు హెడ్‌క్వార్టర్ జిల్లా కేంద్రం కావడంతో నామినేషన్లను ఇక్కడి నుంచే స్వీకరించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు.

63
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles