ఎమ్మెల్సీగా పూల రవీందర్‌ను గెలిపించాలి

Mon,March 18, 2019 02:06 AM

-టీయూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు మల్లారెడ్డి
లింగాలఘనపురం, మార్చి 17: నల్లగొండ, వరంగల్, ఖమ్మం జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా టీఆర్‌ఎస్ బలపర్చిన పూల రవీందర్‌కు మొదటి ప్రాధాన్యం ఓటు వేసి గెలిపించాలని తెలంగాణ యునైటెడ్ టీచర్స్ ఫెడరేషన్(టీయూటీఎఫ్) రాష్ట్ర అధ్యక్షుడు డీ మల్లారెడ్డి పిలుపునిచ్చారు. జనగామ జిల్లా లింగాలఘనపురం మండలంలోని నెల్లుట్లలో ఆదివారం జరిగిన సంఘం సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి తమ సంఘం నిరంతరం శ్రమిస్తోందన్నారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొనని, తెలంగాణ ప్రజల మనోభావాలను గుర్తించని కొన్ని సంఘాలు నేడు ఓట్ల కోసం వస్తున్నాయని, వారికి వచ్చే ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలని ఉపాధ్యాయులకు పిలుపునిచ్చారు. సమావేశంలో సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లచ్చిరాం, రాష్ట్ర ఉపాధ్యక్షుడు వెంకటేశ్వర్లు, జిల్లా అధ్యక్ష కార్యదర్శులు బుర్రా రమేశ్, లకావత్ ఈర్య, మండల అధ్యక్ష కార్యదర్శులు భగవాన్‌రెడ్డి, వేణుగోపాల్, నాయకులు భీమా, వినోద్ తదితరులు పాల్గొన్నారు.

46
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles