ఎమ్మెల్సీ హోదాలో

Mon,March 18, 2019 02:05 AM

-తొలిసారి జిల్లాకు రానున్న సత్యవతి
-వీరభద్రుడి ఆలయంలో పూజలు
-స్వాగతం పలికేందుకు కార్యకర్తల భారీ ఏర్పాట్లు
కురవి, మార్చి 17 : ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా విజయం సాధించిన సత్యవతి ఎమ్మెల్సీ హోదాలో తొలిసారి సొంత జిల్లా మహబూబాబాద్‌కు సోమవారం రానున్నట్లు కురవి టీఆర్‌ఎస్ నాయకులు తెలిపారు. ఆదివారం మండల కేంద్రంలో టీఆర్‌ఎస్ నాయకులు బండి వెంకట్‌రెడ్డి, బండి లకా్ష్మరెడ్డి, బాదె నాగయ్య విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తొలిసారి సొంత జిల్లా, మండలానికి వస్తున్న సందర్భంగా భారీగా స్వాగత ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు. సోమవారం ఉదయం 7గంటలకు హైదరాబాద్‌లోని ఆమె నివాసం నుంచి బయలుదేరి, మరిపెడ మీదుగా నేరుగా కురవి మండల కేంద్రానికి చేరుకుంటారని వివరించారు. మొదట భద్రకాళీ సమేత వీరభద్రస్వామికి మొక్కులు చెల్లించుకోనున్నారు. కురవి పొలిమేర నుంచి భారీ బైక్ ర్యాలీతో స్వాగతం పలికేందుకు కార్యకర్తలు, నాయకులు సిద్ధమవుతున్నట్లు తెలిపారు. అక్కడి నుంచి ఆలయం వరకు బైక్‌ర్యాలీ కొనసాగుతుందన్నారు. ఉదయం 10 గంటలకు స్వామి, అమ్మవారిని దర్శించుకుంటారు. అనంతరం కురవి నేరడ క్రాస్‌రోడ్డులో ఉన్న తెలంగాణ అమరవీరుల స్తూపం వద్దకు చేరుకుని నివాళులు అర్పించనున్నారు. ఆ తర్వాత ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ ప్రెస్‌తో మాట్లాడనున్నారు. కురవిలో కార్యక్రమాలు ముగిసిన అనంతరం ఆమె తన సొంత గ్రామమైన కురవి మండలం గుండ్రాతిమడుగు పెద్దతండాకు చేరుకుంటారని టీఆర్‌ఎస్ నాయకులు తెలిపారు. కార్యక్రమంలో ఐలి నరహరి, బోడ శ్రీనివాస్, గుగులోత్ నెహ్రూ, కేలోత్ అర్జున్ చౌహాన్, బోడ వీరన్న తదితరులు ఉన్నారు.
రెడ్యాతోనే నియోజకవర్గ అభివృద్ధి

45
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles