టీఆర్‌ఎస్ జిల్లా యువ నాయకుడు రవిచంద్ర

Mon,March 18, 2019 02:05 AM

చిన్నగూడూరు, మార్చి17 : డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యానాయక్‌తోనే నియోజకవర్గ అభివృద్ధి సాధ్యమని టీఆర్‌ఎస్ జిల్లా యువ నాయకుడు డీఎస్ రవిచంద్ర అన్నారు. మరిపెడ మండలం అనేపురం శివారు యలమంచిలి తండాకు చెందిన టీఆర్‌ఎస్ నాయకులు ఆదివారం మండలంలోని ఉగ్గంపల్లిలో రవిచంద్రను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రవిచంద్ర మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు దేశవ్యాప్తంగా ఆదరణ పొందుతున్నాయని అన్నారు. ప్రతీ పల్లె, గిరిజన తండాల్లో పక్కారోడ్లు వేయించి డోర్నకల్‌ను ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు ఎమ్మెల్యే రెడ్యానాయక్ కృషి చేస్తున్నట్లు తెలిపారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించే విధంగా ప్రతి కార్యకర్త కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్ నాయకులు భద్రు, ప్రవీన్, సురేశ్, లాలు, రవి, వెంకన్న, హుస్సేన్, వీరన్న, కోక్య తదితరులు ఉన్నారు.

43
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles