ఉపాధ్యాయుల సంక్షేమమే పీఆర్‌టీయూ లక్ష్యం

Sun,March 17, 2019 02:14 AM

-43 శాతం ఫిట్‌మెంట్ సాధించిన పీఆర్‌టీయూ
-ఎమ్మెల్సీ అభ్యర్థి పూల రవీందర్
మహబూబాబాద్, నమస్తే తెలంగాణ, మార్చి 16: తెలంగాణ ఉపాధ్యాయుల క్షేమమే పీఆర్‌టీయూ లక్ష్యంగా పనిచేస్తుందని వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి పూల రవీందర్ అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా మహబూబాబాద్ జిల్లాలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 42 సంవత్సరాలుగా, పీఆర్‌టీయూ ఉపాధ్యాయుల న్యాయపరమైన సమస్యలను ప్రభుత్వంతో సానుకూలంగా వ్యవహరిస్తూ సమస్య పరిష్కారానికి కృషి చేసిందని అన్నారు. గత ఎన్నికల్లో ఎమ్మెల్సీ అభ్యర్థిగా గెలిచి అనేక జీవోలను సాధించుకున్నామన్నారు. ఐదు సంవత్సరాలుగా ప్రభుత్వంతో సానుకూలంగా వ్యవహరించి ఉపాధ్యాయుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వాటిపై చర్చించి, సీఎంను ఒప్పించి జీవో 010 ద్వారా వేతనాలు, 40వ జీవో ద్వారా ఉపాధ్యాయుల పదోన్నతులు, ఉపాధ్యాయులకు 5 రోజులు అత్యవసర సెలవు, మెటర్నిటీ సెలవులు సాధించుకున్నామ న్నారు. గతంలో కంటే ఎక్కువ ఫిట్‌మెంట్ సాధించుకోబోతున్నామని తెలిపా రు. ఎన్నో ఏళ్లుగా పనిచేస్తున్న 10479 పండిట్ ఉపాధ్యాయులను అప్‌గ్రేడ్ చేసేందుకు పీఆర్‌టీయూ ముందు నడిచిందని అన్నారు. ఉపాధ్యాయుల కుటుంబాల రక్షణకు కోసం సీపీఎస్ రద్దు చేసేందుకు శాయశక్తుల ప్రయత్నిస్తానన్నారు. ఎమ్మెల్సీ అభ్యర్థిగా మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పీఆర్‌టీయూ జిల్లా అధ్యక్షుడు మిర్యాల సతీశ్‌రెడ్డి, జిల్లా కార్యదర్శి సంకా బద్రినారాయణ, జిల్లా ఉపాధ్యాక్షురాలు ఉమాదేవి, ఇన్‌చార్జి హెచ్ సునిత వెంకన్న, రాష్ట్ర అసోసియేషన్ అధ్యక్షులు మురళీధర్‌స్వామి, లక్ష్మమయ్య తదితరులు పాల్గొన్నారు.

44
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles