తాగునీటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలి

Sun,March 17, 2019 02:14 AM

-సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్యే రెడ్యానాయక్
-అధికారుల తీరుపై ఆగ్రహం
-పనులు పూర్తిచేయాలని ఆదేశం
నర్సింహులపేట, మార్చి 16: మండలంలోని అన్ని గ్రామాలు, తండాల ప్రజలకు తాగునీటి ఇబ్బందులు లేకుండా మిషన్ భగీరథ ద్వారా నీటిని అందించాలని డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యానాయక్ అన్నారు. శనివారం మండల కేంద్రంలో ఎంపీపీ సంపెట సుజాత అధ్యక్షత సర్వసభ్య సమావేశం నిర్వహించారు. గ్రామాల్లో నిర్మాణం చేస్తున్న సీసీరోడ్ల పనుల్లో అధికారుల పర్యవేక్షణ కరువైందని, పనులు పూర్తి చేసిన అధికారులు మెజర్‌మెంట్ పూర్తి చేయకపోవడంతో పనులు చేసిన ప్రజా ప్రతినిధులు ఇబ్బందులు పడుతున్నారని ఎంపీపీ పీఆర్ నర్సింగ్ నాయక్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే దంతాలపల్లి మండలంలోని బొడ్లాడలో గ్రామ పంచాయతీ పనులు పూర్తి కాకపోవడంతో రోడ్లపై కూర్చోవాల్పి వస్తుందని సర్పంచ్ సుష్మ ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లారు. రామన్నగూడెం గ్రామంలో వర్మి కంపోస్టు తయారీ కోసం షెడ్ నిర్మాణం చేసి మూడేళ్లవుతున్నా వ్యవసాధికారులు బిల్లులు చెల్లించడం లేదని ఎంపీటీసీ మంద సురేందర్ రెడ్డి అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కొమ్ములవంచ, శివారు దుబ్బతండా, రూప్లాతండా శివారు ఎర్రచకృతండా బీటీరోడ్డు పనుల్లో నాణ్యత లేదని, రోడ్డు పనులు ఐటీడీఏ పరిధిలో ఉన్నందున కలెక్టర్ ఫిర్యాదు చేస్తామని సర్పంచ్ డీ వెంకటేశ్వర్లు తెలిపారు.

ఈ సందర్భంగా మహిళా సర్పంచ్, ఎంపీటీసీలతో పాటు వారి భర్తలు సమావేశానికి రావడంతో ఎంపీడీవో సత్యనారాయణ రెడ్డి ప్రజాప్రతినిధులు తప్ప మిగిలిన వారు వెళ్లి పోవాలని సూచించడంతో వారు వెళ్లిపోయారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ వేసవికాలాన్ని దృష్టిలో ఉంచుకుని అన్ని గ్రామాలు, తండాలకు మిషన్ భగీరథ ద్వారా నీటిని అందించాలని, ఓహెచ్‌ఎస్‌ఆర్ ట్యాంకుల నిర్మాణ పనులు త్వరతగతిన పూర్తి చేయాలని అన్నారు. ఉపాధి పథకంలో చేపడుతున్న హరితహారంలో ప్రజలకు అవసరమైన మొక్కలు పెంచాలన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ ధర్మారపు వేణు, పీఏసీఎస్ చైర్మన్ మైదం దేవేందర్, వైస్ ఎంపీపీ వేముల రాంరెడ్డి, నర్సింహులపేట, దంతాలపల్లి మండలాల సర్పంచ్, ఎంపీటీసీలు, అధికారులు పాల్గొన్నారు.

55
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles