ఎమ్మెల్యే రాకతో మరింత అభివృద్ధి

Sun,March 17, 2019 02:14 AM

-టీఆర్‌ఎస్ ప్రధాన కార్యదర్శి ఎనుగుల ఐలయ్య
బయ్యారం: ఎమ్మెల్యే హరిప్రియ రాకతో నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందుతుందని టీఆర్‌ఎస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి ఎనుగుల ఐలయ్య అన్నారు. శుక్రవారం మండల కేంద్రం లో జరిగిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ దశాబ్ధాల పాటు నియోజకవర్గం లో అధికార పార్టీ లేకపోవటంతో ఇక్కడి ప్రజలు అభివృద్ధికి నోచుకోలేదని తెలిపారు. ఈ తరుణం లో టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంతో అభివృద్ధి జరిగిందని తెలిపారు. ముఖ్యమంత్రి అందిస్తున్న జన రంజక పాలనతో ఆకర్శితులై ఎమ్మెల్యే హరిప్రియ పార్టీలో చేరుతున్న ట్లు ప్రకటించటాన్ని స్వాగతిస్తున్నట్లు తెలిపారు. ఎమ్మెల్యే హరిప్రియ రాకతో నియోజక వర్గం ఎంతో అభివృద్ధి చెందుతుందని అన్నారు. ఇటీవల ముఖ్యమంత్రిని కలసిన ఎమ్మెల్యే హరిప్రియ నియోజకవర్గంలోని పలు సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకవెళ్లటంతోనే అభివృద్ధిపై ఆమెకు ఉన్న చిత్తశుద్ధి వ్యక్తమౌతుందని తెలిపారు. టీఆర్‌ఎస్‌లో చేరుతున్నట్లు ప్రకటించిన తర్వాత మొదటిసారి బయ్యారానికి వస్తున్న హరిప్రియకు టీఆర్‌ఎస్ శ్రేణులు ఘన స్వాగతం పలికేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. బం గారు తెలంగాణ కోసం పాటుపడనున్న ఎమ్మెల్యే హరిప్రియ బాటలో నడిచేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్ సీనియర్ నాయకులు రెంటాల బుచ్చిరెడ్డి, సమన్వయ సమితి జిల్లా సభ్యుడు కొండ్రెడ్డి సోమిరెడ్డి, ఎంపీటీసీ మంగీలాల్, బీసీసెల్ అధ్యక్షుడు రాంముర్తి గౌడ్, నాయకులు లక్ష్మణ్ ఉన్నారు.

28
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles