నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు

Sat,February 23, 2019 02:59 AM

-ప్రభుత్వ దవాఖానలో ప్రసవాలు పెంచాలి
-సమస్యలు లేని భూములను పహాణీల్లో నమోదుచేయాలి
-కలెక్టర్ సీహెచ్ శివలింగయ్య
-వైద్య, రెవెన్యూ, అటవీశాఖాధికారులతో సమీక్ష
మహబూబాబాద్ టౌన్, ఫిబ్రవరి 22: విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తూ పనితీరును మెరుగుపరుచుకోని వైద్యాధికారులపై కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ సీహెచ్ శివలింగయ్య హెచ్చరించారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లాలోని వైద్య, ఆరోగ్య శాఖల ద్వారా జిల్లాలోని 18 పీహెచ్‌సీల్లో అందిస్తున్న వైద్యలపై పీహెచ్‌సీల వారీగా సంబంధిత మెడికల్ అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కేసీఆర్ కిట్‌లో జిల్లా వెనుకంజలో ఉందని, కేవలం 25 శాతం మాత్రమే అర్హత గల గర్ఛిణుల నమోదుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వచ్చే వారంలో 100 శాతం నమోదు కావాలని ఆదేశించారు. అందుకుగాను పీహెచ్‌సీ వైద్యాధికారి పూర్తి బాధ్యత వహిస్తూ సూపర్‌వైజర్లు, ఏఎన్‌ఎంలతో నమో దు చేయించాలని అన్నారు. ప్రతీ ప్రసవం ప్రభుత్వ దవాఖానలో జరిగేలా తగు చర్యలు తీసుకోవాలని వైద్యాధికారులను ఆదేశించారు. జిల్లాలో ఇప్పటి వరకు 6713 ప్రసవాలు జరగగా అందులో 5515 సిజేరియన్, 1165 నార్మల్ ప్రసవాలు జరిగాయని, సిజేరియన్ ప్రసవాలకు బదులు, నార్మల్ ప్రసవాలు వీలైనంత వరకు చేయాలని అన్నారు. జిల్లాలో పీహెచ్‌సీల వారీగా టీబీ కేసుల నియంత్రణపై సమీక్షించారు. సమయపాలన పాటించని వారి జీతభత్యాల్లో మార్చి నెల నుంచి కోత విధించనున్నట్లు హెచ్చరించారు. ఈ సమీక్షలో డీఎంహెచ్‌వో డాక్టర్ శ్రీరాం, డిప్యూటీ డీఎంహెచ్‌వో కోటాచలం, 18 పీహెచ్‌సీల వైద్యాధికారులు, సూపర్‌వైజర్లు, కేసీఆర్ కిట్ అధికారి బిందుశ్రీ పాల్గొన్నారు.

రెవెన్యూ, అటవీ భూముల సమస్యలు పరిష్కరించాలి
రెవెన్యూ, అటవీ భూముల సమస్యలు పరిష్కరించుటకు తగు చర్య లు తీసుకోవాలని కలెక్టర్ సీహెచ్ శివలింగయ్య అధికారులను ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం కలెక్టరేట్ సమావేశం మందిరంలో అటవీ, రెవెన్యూ అధికారులతో సమస్యలపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనల మేరకు రెవెన్యూ, అటవీ, లాండ్ సర్వే నుంచి ఒక్కొక్కరు చొప్పున టీం తయారు చేసి రెవెన్యూ, అటవీ సమస్యలు లేని భూములను మండల స్థాయిలో రెవెన్యూ రికార్డులను అటవీ భూముల పహాణీలో నమోదు చేయాలన్నారు. సమస్యలు ఉన్నచో క్షేత్రస్థాయిలో సర్వే చేసి సమస్యలు పరిష్కరించాలని చెప్పారు. ఈ సమావేశంలో జేసీ డేవిడ్, డీఎఫ్‌వో కిష్టాగౌడ్, ఆర్డీవోలు ఈశ్వరయ్య, కొమురయ్య, ల్యాండ్ సర్వే ఏడీలు, తహసీల్దార్లు, సర్వేయర్లు పాల్గొన్నారు.

45
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles