అభివృద్ధిలో ఆదర్శం.. తెలంగాణ

Sat,February 23, 2019 02:58 AM

ఢిల్లీలో తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి రాంచంద్రు నాయక్
మహబూబాబాద్ టౌన్, ఫిబ్రవరి 22: అభివృద్ధిలో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచిందని ఢిల్లీలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అధికార ప్రతినిధి తేజావత్ రాంచంద్రునాయక్ అన్నారు. శుక్రవారం స్థానిక ఆర్ అండ్ బీ విశ్రాంతి భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. లంబాడీల ఆరాధ్యదైవం సంత్ సేవాలాల్ 280వ జయంతి సందర్భంగా మదాపూర్ పరిధి తేజావత్ తండాలో ప్రత్యేక పూజలు నిర్వహించిన ట్లు చెప్పారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని ప్రజలంతా సుఖశాంతులతో ఉం డాలని కోరుకున్నట్లు చెప్పారు. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాల పేర్లను దేశంలోని వివిధ రాష్ర్టాలు మార్చేసి వాటిని అమలు చేస్తున్నట్లు చెపాపరు. ముఖ్యంగా తెలంగాణలో ప్రవేశ పెట్టిన రైతుబంధు పథకాన్నే అదర్శంగా తీసుకుని కేంద్రంలో ప్రధాని మోడీ ప్రధాన్‌మంత్రి కిసాన్ సమ్మాన్ యోజన పేరుతో పథకాన్ని ప్రవేశపెట్టారని గుర్తు చేశారు. అభివృద్దిలో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శం అని కితాబిచ్చారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీ అన్ని స్థానాల్లో ఘన విజయం సాధిస్తుందని, ఇప్పటికే సీఎం కేసీఆర్ ప టిష్టమైన అభ్యర్థులను ఎంపిక చేసే పనిలో నిమగ్నమైఉన్నారని తెలిపారు. ఈ సందర్భంగా పాటల సీడీని ఆయన విడుదల చేశారు.

32
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles