లంబాడీల ఆరాధ్యుడు సేవాలాల్ మహరాజ్

Sat,February 23, 2019 02:58 AM

-డోర్నకల్ టీఆర్‌ఎస్ యువ నేత డీఎస్ రవిచంద్ర
-ఘనంగా భోగ్ బండారో..
మరిపెడ, నమస్తేతెలంగాణ, ఫిబ్రవరి 22: లంబాడీల ఆరాధ్యుడు సంత్ సేవాలాల్ మహరాజ్ అని డోర్నకల్ టీ ఆర్‌ఎస్ యువ నేత ధరంసోత్ రవిచంద్ర అన్నారు. శుక్రవారం మరిపెడ మండల పరిషత్ ఆవరణలో ఎల్‌హెచ్‌పీఎస్, గిరిజన ప్రజాప్రతినిధులు సేవాలాల్ జయంతి ఉత్సవాలను నిర్వహించారు.ఇందులో భాగంగా భోగ్ బండారో కార్యక్రమాన్ని ఎల్‌హెచ్‌పీఎస్ డోర్నకల్ నియోజకవర్గ కన్వీనర్ భూక్య రామ్మూర్తినాయక్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి రవిచంద్ర హాజరై ప్రత్యేక పూ జలు చేశారు. గిరిజన సాధువులు రవిచంద్రను ఆశీర్వదించారు. రాబోయే రోజుల్లో రవిచంద్ర ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. అనంతరం రవిచంద్ర మాట్లాడు తూ సేవాలాల్ మహరాజ్ లంబాడీ జాతికి ఎల్లప్పుడూ గుర్తుండి పోతారని, ఆయన చేసిన సేవలు ఎంతో గొ ప్పవన్నారు. ఆయన చూపిన మార్గంతోనే లంబాడీలు అం చెలంచెలు ఎదుగుతూ వచ్చారన్నారు. మన జాతిని ఉన్నతస్థాయికి తీసుకెళ్లడానికి సీఎం కేసీఆర్ ఎంతో కృషి చేస్తున్నారన్నారు. రవిచంద్రను లంబాడీ మహిళలు నృత్యాల తో స్వాగతించారు. స్థానిక గిరిజన విద్యార్థులు మార్చ్‌ఫాస్ట్‌తో అహ్వానం ఫలికారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ భా ల్ని మాణిక్యం, ఎంపీపీ తాళ్లపెల్లి రాణిశ్రీనివాస్, మరిపెడ మాజీ సర్పంచ్ పానుగోత్ రాంలాల్, సర్పంచ్‌లు హరినాయక్, హుస్సేన్‌నాయక్, భరత్‌నాయక్, ఎంపీటీసీ. కేలోత్ వస్రాం, బోడా రూప్లా, మరిపెడ పట్టణ రైతు సమితి కో ఆ ర్డినేటర్ పానుగోత్ వెంకన్న, జాటోత్ బాలాజీనాయక్, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, టీఆర్‌ఎస్ నాయకులు, సాధు కుల పెద్దలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి హాజరైన ప్రతీ ఒక్కరికీ నిర్వాహకులు అన్నదానం చేశారు.

105
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles