ఆవిర్బావం అదిరింది

Mon,February 18, 2019 02:17 AM

ములుగు ప్రతినిధి, నమస్తేతెలంగాణ: అధికారులు, ప్రజా ప్రతినిధులు ప్రజల సహకారంతో ములుగు జిల్లాను రాష్ట్రంలోనే అభివృద్ధిలో అగ్రగామిగా నిలపాలని జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన వాసం వెంకటేశ్వర్లు అ న్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి కే చం ద్రశేఖర్‌రావు పుట్టిన రోజునే నూతన జిల్లాగా ములుగు ఆవిర్భవించ డం ప్రజల అదృష్టంగా భావిస్తున్నామని అన్నా రు. గిరిజన, అటవీ ప్రాంతం, నీటి వనరులు అత్యధికంగా ఉన్న జిల్లా ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి అధికారులు కృషి చే యాలని అన్నారు. ప్రభుత్వం అందజేస్తున్న రైతుబంధు, రైతుబీమా, కల్యాణలక్ష్మి, షాదీముభారక్, ఆసరా పింఛన్లపాటు ఇత ర పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అటవీ భూముల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు. జిల్లాను విద్యారంగంలో అగ్రగామిగా తీర్చిదిద్దడానికి గిరిజన విశ్వవిద్యాలయం, కేంద్రీ య విద్యాలయాల ఏర్పాటుకు తోడ్పాటును అందించాలని కోరారు.
పది రోజుల్లో కార్యకలాపాలు
మేడారం సమ్మక్క-సారలమ్మ ఆశీర్వాదంతో నూతన జి ల్లా గా ఏర్పడిన ములుగులో మరో పది రోజుల్లో పూర్తిస్థాయి కార్యకలాపాలు అందుబాటులోకి తీసుకురానున్నట్లు వెల్లడించారు. ప్రజలకు మెరుగైన సేవలను అందిచేందుకు ఎల్లవేళలాఅందుబాటులో ఉంటూ ప్రత్యేక శ్రద్ధను కనబర్చుతామని అన్నారు. రాష్ట్ర ప్రభు త్వం జిల్లా కార్యాలయాల కోసం ప క్కా భవనాలు నిర్మించే వరకు తా త్కాలిక కార్యాలయాలను ఏర్పాటు చేసి మంచి సేవలను అందిస్తామని వెల్లడించారు.

కల్యాణలక్ష్మి ఫైళ్లపై తొలి సంతకం
కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు రాష్ట్ర ప్రభుత్వ అత్యంత ప్రతిష్టాత్మకమైన పథకాలనైన కల్యాణలక్ష్మి, షాదీముభారక్ లబ్ధిదారుల చెక్కుల ఫైళ్లపై మొదటి సంతకం చేశారు. 75 మం ది లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు. ప్రభుత్వం నూ తనంగా ప్రవేశపెట్టిన 57 సంవత్సరాల వయస్సు గల వా రికి అందించే వృద్ధాప్య పింఛన్‌తోపాటు ఇతర పింఛన్లపై రెండవ సంతకం, పాస్‌బుక్‌ల సమస్యల పరిష్కరించే ఫైల్‌పై మూడో సంతకం చేశారు.

బాధ్యతలు స్వీకరించిన కలెక్టర్, ఎస్పీ
భూపాలపల్లి జయశంకర్ జిల్లా కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు ములుగు జిల్లా నూతన కలెక్టర్‌గా అదనపు బాధ్యతలు స్వీకరించారు. జిల్లా ఎస్పీగా ఆర్ భాస్కరన్ బాధ్యతలను చేపట్టారు. అదనపు బాధ్యతలు స్వీకరించేందుకు అవకాశం కల్పించిన రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి కేసీఆర్‌కు వారు కృతజ్ఞతలు తెలిపారు. అదేవిధంగా పుట్టిన రో జు జరుపుకుంటున్న రాష్ట్ర ముఖ్యమంత్రికి జన్మదిన శుభాకాంక్షలను తెలియజేశారు. ఈ ఆవిర్భావ వేడుకల్లో ఏఎస్పీ రాజమహేంద్రనాయక్, ఓఎస్‌డీ సురేశ్‌కుమార్, జా యిం ట్ కలెక్టర్ స్వర్ణలత, ఆర్డీవో కూతాటి రమాదేవి, తహసీల్దార్ గన్యానాయక్, డీఎస్పీ విజయసారథి, జెడ్పీఫ్లోర్‌లీడర్ సకినాల శోభన్, ఎంపీపీ భూక్యా మంజుల, సర్పంచ్ బండారి నిర్మలతోపాటు ఎంపీటీసీలు, సర్పంచ్‌లు, వివిధ పార్టీలకు చెందిన నాయకులు, అధికారులు, జిల్లా వాసులు పాల్గొన్నారు.

సద్వినియోగం చేసుకోవాలి
అటవీ, గిరిజన ప్రాంతమైన ములుగు జిల్లాలో అపారమైన ప్రకృతి వనరులు అందుబాటులో ఉ న్నాయని, ఆ వనరులను ప్రతీ ఒక్కరు వినియోగించుకొని ఆర్థికాభివృద్ధి చెందాలని పిలుపునిచ్చారు. రా మప్ప, లక్నవరంతోపాటు పలు చెరువులు, కుం టలతో వ్యవసాయానికి సాగు నీరు పుష్కలంగా అందుబాటు లో ఉందన్నారు. సంస్కృతి, సంప్రదాయాలకు అద్దంపట్టే మే డారం సమ్మక్క-సారలమ్మ జాతర, చరిత్రకు నిదర్శనమైన రా మప్ప ఆలయం వంటి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన చారిత్రత్మక, పర్యాటక కేంద్రాలను అభివృద్ధి చేసుకోవాలని అన్నారు. అడవులను పరిరక్షించుకోవాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.

వేడుకగా కార్యాలయాలప్రారంభోత్సవం
ములుగుటౌన్: మొన్నటి వరకు రెవెన్యూ డివిజన్‌గా ఉండి రాష్ట్రంలో 33వ జిల్లాగా అవిర్భవించిన ములుగు జిల్లా కార్యాలయాల ఏర్పాటుతో కొత్త శోభను సంతరించుకుంది. జిల్లా కార్యాలయాల ప్రారంభోత్సవాలు వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య, మేళతాళాలతో పండుగ వాతావరణం మధ్య కొనసాగాయి. ఈసందర్భంగా నూతనంగా అధనపు బాధ్యతలు స్వీకరించిన కలెక్టర్, ఎస్పీలకు జెడ్పీ చైర్‌పర్సన్ గద్దల పద్మ, మాజీ మంత్రి చందూలాల్, ఎమ్మెల్యే సీతక్క, మానుకోట ఎంపీ అజ్మీరా సీతారాంనాయక్, ములుగు ఎంపీపీ భూక్య మంజుల పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. కాగా జిల్లా ట్రెజరీ కార్యాలయం, ఆర్డీవో కార్యాలయాన్ని, సీడబ్ల్యూవో కార్యాలయాన్ని జేసీ సర్ణలత ప్రారంభించారు. జిల్లా విద్యాశాఖ కార్యాలయాన్ని మనోహర్‌నాయక్, ప్రారంభిం చారు. డీఏవో కార్యాలయాన్ని ఇన్‌చార్జ్జి డీఏవో గౌస్ హైదర్ ప్రారంభించారు. ఫారెస్టు కా ర్యాలయాన్ని వరంగల్ చీఫ్ కన్జర్‌వేటర్ ఎంజే అక్బర్, ప్రారంభించగా, డీఎఫ్‌ఓగా ప్రదీప్ కుమార్‌శెట్టి అదనపు బాధ్యతలు చేపట్టారు.

ఎక్సైజ్ జిల్లా కార్యాలయాన్ని సూపరింటెండెంట్ శశిధర్‌రెడ్డి ప్రారంభించి అదనపు బాధ్యతలు చేపట్టారు. కాగా భూపాలపల్లి, ములుగు జి ల్లాలకు సబ్‌రిజిస్టార్‌గా తస్లీమ్‌మహ్మద్ బాధ్యతలు స్వీకరించారు. చీఫ్ ప్లానింగ్ కార్యాల యాన్ని, కోఆపరేటివ్ కార్యాలయాన్ని ఆర్డీవో కూతాటి రమాదేవి ప్రారంభించారు. మిషన్ భగీరథ కార్యాలయాన్ని ఈఈ మాణిక్యరావు, ఆర్‌డబ్ల్యూఎస్ కార్యాలయాన్ని ఎస్‌ఈ రాం చంద్రానాయక్, డీపీవో కార్యాలయాన్ని ఎమ్మెల్యే సీతక్క ప్రారంభించారు. అదేవిధంగా ఏరియా దావాఖానలో డీఎంహెచ్‌వో కార్యాలయాన్ని భద్రాద్రి జిల్లా కొత్తగూడెంలో అడిషన ల్ డీఎంహెచ్‌ఓగా బాధ్యతలు నిర్వహిస్తున్న డాక్టర్ సంగరాజు ప్రారంభించి విధుల్లో చేరారు. ఈ వేడుకల్లో ఆయా శాఖల అధికారులు, సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు.

70
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles