సేవాలాల్ జయంతి ఉత్సవాలకు సర్వంసిద్ధం

Sun,February 17, 2019 02:55 AM

డోర్నకల్, ఫిబ్రవరి 16 : గిరిజనుల (లంబాడల) ఆరాధ్యదైవం సంత్ శ్రీశ్రీశ్రీ సేవాలాల్ మహారాజ్ 280వ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశారు. డోర్నకల్‌లోని శ్రీ పంచముఖలింగేశ్వరస్వామి దేవాలయ ప్రాంగణంలో ఉన్న సేవాలాల్ మహారాజ్ ఆలయంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో అధికారికంగా ఉత్సవాలను నిర్వహించనున్నట్లు డోర్నకల్ మండల పరిషత్ ప్రత్యేక అధికారి ఆనంద్‌కుమార్ తెలిపారు. ఈ నెల 21 బోగ్‌బండారో, అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు వెల్లడించారు. శనివారం స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో గిరిజన నాయకులు పెద్దలతో జరిగిన సమావేశంలో ఆయన వారి సలహామేరకు కార్యక్రమాలకు రూపకల్పన చేశారు. సమావేశంలో డోర్నకల్ తహసీల్దార్ నర్సింహరావు, ఎంపీడీవో నారాయణ రెడ్డి, పీఎసీఎస్ అధ్యక్షుడు రాయల వెంకటేశ్వరరావు, డోర్నకల్ పట్టణ టీఆర్‌ఎస్ అధ్యక్షుడు వాంకుడోతు వీరన్న, సేవాలాల్ సేన డోర్నకల్ మండల అధ్యక్షుడు తేజావత్ లకా్ష్మనాయక్, దేవ్‌సింగ్, చాందావత్ వెంకన్న, తేజావత్ రాజునాయక్, తేజావత్ ప్రసాద్‌నాయక్, తేజావత్ శంకర్‌నాయక్, జర్పుల రమేశ్ నాయక్ పాల్గొన్నారు. కురవి: మండల కేంద్రంలో ఈనెల 18న సేవాలాల్ మహారాజ్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించే జయంతి వేడుకల్లో ప్రతీ గిరిజనుడు పాల్గొనాలని కమిటీ చైర్మన్ గుగులోత్ రవి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా సేవాలాల్ సేవలను కొనియాడారు.

64
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles