అమర జవాన్లకు అశ్రు నివాళి

Sat,February 16, 2019 02:13 AM

మరిపెడ, నమస్తేతెలంగాణ : జమ్ముకశ్మీర్‌లోని పుల్వామా దగ్గర సీఆర్‌పీఎఫ్ బలగాలపై జరిగిన ఉగ్రదాడిలో వీరమరణం పొందిన జవాన్ల త్యాగాలు మరువులేనివంటూ.. శుక్రవారం రాత్రి స్నేహ యువ కేంద్రం ఆధ్వర్యంలో పలువురు యువకులు కొవ్వొత్తులతో శాంతి ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ స్థానిక బస్టాండ్ సెంటర్ నుంచి రాజీవ్‌గాంధీ సెంటర్ మీదుగా కార్గిల్ స్థూపం వరకు సాగింది. స్నేహ యువ కేంద్రం కార్యదర్శి పీఎస్ గూడెం సర్పంచ్ నూకల అభినవ్‌రెడ్డి, ఆ సంస్థ మేనేజర్ కాలం రవీందర్‌రెడ్డి, సంస్థ సభ్యులు గుండగాని బాబు, సుందర్, మునేశ్, తల్లాడ రవి, సురేశ్, టీయూడబ్ల్యూజే 143 యూనియన్ నియోజకవర్గ బాధ్యుడు గండి విష్ణు పాల్గొన్నారు.

కొవ్వొత్తుల ర్యాలీ, మానవహారం
దంతాలపల్లి : మండల కేంద్రంలోని వరంగల్- ఖమ్మం ప్రధాన రహదారిపై భారత జవాన్లపై ఉగ్రమూకల దాడిని నిరసిస్తూ, గ్రామస్తులు కొవ్వొత్తులతో ర్యాలీ తీశారు. అంబేద్కర్ సెంటర్‌లో మానవహారం నిర్వహించారు.

నెల్లికుదురు : కశ్మీర్‌లో జైషే ముష్కరుల దాడిలో మృతి చెందిన వీర జవానుల ప్రాణ త్యాగాలు మరువలేనివని సిటిజన్ ఫోరం మండల కన్వీనర్ కస్తూరి శంకర్ అన్నారు. వారి మృతికి సంతాపంగా శుక్రవారం మండల కేంద్రంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆత్మకు శాంతి చేకూరాలని మౌనం పాటించారు. తొర్రూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మెన్ జిలుకర యాలాద్రి, రామన్నగూడెం ఉపసర్పంచ్ కాసం చిన్నకా్ష్మరెడ్డి, నెల్లికుదురు టీఆర్‌ఎస్ పట్టణశాఖ అధ్యక్షుడు వెన్నాకుల శ్రీనివాస్, ఎస్‌ఎఫ్‌ఐ మండల కన్వీనర్ పీ గణేశ్ వివిధ ప్రజాసంఘాల నాయకులు బొల్లం ఎల్లయ్య, ఎడ్ల మహేశ్, దర్శనం యుగేందర్, శ్రీను, పెరుమాండ్ల తిలక్, బందు లక్ష్మణ్, కడారి రాములు, చీకటి జగదీశ్ తదితరులు పాల్గొన్నారు.
తొర్రూరు రూరల్ : దేశంలో జరుగుతున్న ఉగ్రవాద చర్యలు తిప్పికొట్టాలని ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రాపాక రాజు పిలుపునిచ్చారు. జమ్ముకాశ్మీర్‌లో సీఆర్పీఎఫ్ కాన్వాయ్‌పై దాడికి పాల్పడి ఎంతోమంది ప్రాణాలను బలి గొన్న ఉగ్రవాద దాడిని ఖండిస్తూ పాకిస్తాన్ ఉగ్రవాద దిష్టిబొమ్మను శుక్రవారం డివిజన్‌లో ఏబీవీపీ ఆధ్వర్యంలో దహనం చేశారు. ఏబీవీపీ నాయకులు శ్రావణ్‌కుమార్, ప్రశాంత్, కార్తీక్, కరుణాకర్, వినోద్, ఉదయ్, శ్రీకాంత్, నరేశ్, రాజు పాల్గొన్నారు.

44
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles