పల్లెలన్నీ వనంతో పచ్చబడాలి

Sat,February 16, 2019 02:09 AM

మరిపెడ, నమస్తేతెలంగాణ, ఫిబ్రవరి 15: పల్లెలన్నీ వనంతో పచ్చబడాలని మండల రైతు సమన్వయ సమితి కోఆర్డినేటర్ చాపల యాదగిరిరెడ్డి అన్నారు. శుక్రవారం మండలంలోని తాళ్లూకల్‌లో ఎన్‌ఆర్‌ఈజీఎస్ ద్వారా ఏర్పాటు చేస్తున్న గ్రామీణ నర్సరీని యాదగిరిరెడ్డి టేకు విత్తనాలు నాటి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొక్కలను నాటి వాటిని సంరక్షిస్తే కలిగే లాభాలను గ్రామస్తులకు వివరించారు. ప్రతీ ఒక్కరు పది మొక్కలను నాటి వాటిని విధిగా సంరక్షించాలని సూచించారు. అడవుల పెంపకోసమే సీఎం కేసీఆర్ హరితహారాన్ని చేపట్టారన్నారు. తాళ్లూకల్ గ్రామీణ నర్సరీకి రూ.5లక్షలను ప్రభుత్వం మంజూరు చేసినట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో ఏపీవో మంగమ్మ, పీఏసీసీఎస్ చైర్మన్ నందారపు నగేశ్, గ్రామ సర్పంచ్ బోలగాని మన్మధ, ఎంపీటీసీ శ్రీరాముల రాములు, టీఏ సురేశ్, ఎఫ్‌ఏ దేవేందర్, ఉప సర్పంచ్ సౌజన్య, టీఆర్‌ఎస్ నాయకులు చాపల సీతారాంరెడ్డి, బోలగాని శ్రీనివాస్, మామిళ్ల వెంకన్న, సీఏ ఉమ తదితరులు పాల్గొన్నారు.

42
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles