పేదల ఆరోగ్యానికి సీఎంఆర్‌ఎఫ్ రక్ష

Fri,February 15, 2019 01:38 AM

మరిపెడ, నమస్తేతెలంగాణ, ఫిబ్రవరి 14 : పేదల ఆరోగ్యానికి సీఎంఆర్‌ఎఫ్ అని ఎమ్మెల్యే రెడ్యానాయక్ అన్నారు. మరిపెడ మండలం తం డా ధర్మారం గ్రామానికి చెందిన డీ.బాసునాయక్ అనారోగ్య సమస్యతో హైదరాబాద్‌లోని కార్పొరేట్ దవాఖానలో చికిత్స పొందాడు. ఈ నేపథ్యం లో సీఎం సహాయ నిధికి దరఖాస్తు చేసుకోగా రూ.5లక్షలు మంజూరయ్యాయి. ఈ చెక్కును ఎమ్మెల్యే రెడ్యానాయక్ బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు. ఆయన వెంట గ్రంధాలయ సంస్థ జిల్లా చైర్మన్ నవీన్, టీఆర్‌ఎస్ యువ నేత డీఎస్ రవిచంద్ర, ఎంపీపీ తాళ్లపెళ్లి రాణిశ్రీనివాస్, జెడ్పీటీసీ బాల్ని మాణిక్యం, మానుకోట ఏఎంసీ మాజీ చైర్మన్ రామసహాయం సత్యనారాయణరెడ్డి, తండా ధర్మారం మాజీ సర్పంచ్ బాబునాయక్ ఉన్నారు.

చిన్నగూడూరులో...
చిన్నగూడూరు : మండలంలో పలువురికి మంజూరైన సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యానాయక్ అందజేశారు. గుగులోత్ శక్రుకు రూ.12000, సూర్యకు23,000, బి.అమలకు 33000 , లాల్‌సింగ్‌కు 3000 పంపిణీ చేశారు. ఈసందర్బంగా రెడ్యా మాట్లాడారు. కేసిఆర్ సంక్షేమ పథకాలు ఇంటింటికీ లబ్ది చేకూర్చుతున్నాయన్నారు. కేకార్యక్రమంలో మండల కోఆప్షన్ సభ్యుడు అయూబ్‌పాషా, నాయకులు గొర్ల సత్తిరెడ్డి, వీరన్న ,హరిలాల్ ఉన్నారు.

నర్సింహులపేటలో...
నర్సింహులపేట : పేదల ఆరోగ్యం కాపాడేందుకు తెలంగాణ ప్రభుత్వం, సీఎం కేసీఆర్ నిధు లు అందిస్తోందని ఎమ్మెల్యే రెడ్యానాయక్ అన్నారు. మండలంలోని పడమటిగూడెం గ్రామానికి చెందిన పైండ్ల ఉమకు రూ.8 వేలు, అల్వల ప్రశాంత్‌కు రూ. 6వేలు, బానోత్ రాజుకు రూ. 6 వేల చెక్కు అందించారు. ఆరోగ్యశ్రీలో వైద్యం అందని వారికి సీఎంఆర్‌ఎఫ్ ద్వారా చికిత్స చేయించుకోవచ్చన్నారు. కార్యక్రమంలో ఎంపీటీసీ రమేశ్‌రెడ్డి, చిమ్ముల శ్రీను, యాకన్న, వీరు, వెంకట్‌రెడ్డి, వేదయ్య, శ్రీశైలం ఉన్నారు.

రెడ్యాకు ఘన సన్మానం
చిన్నగూడూరు : డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యానాయక్‌ను మండలంలోని ఉగ్గంపల్లిలో దంతాలపల్లి ఉసర్పంచ్, స్థానిక టీఆర్‌ఎస్ నాయకులు గురువారం సన్మానించారు. ఈ సందర్భంగా ఉపసర్పంచ్, ఎంపీటీసీలు బొల్లు శిరీష, కిషోర్ మాట్లాడారు. నియెజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్తున్న ఘనత ఎమ్మెల్యే రెడ్యానాయక్‌దే అన్నారు. రెడ్యాతోనే ప్రతీ గ్రామానికి పక్కారోడ్డు ఏర్పడిందన్నారు. కార్యక్రమంలో టిఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు వెంకటేశ్వరరెడ్డి, జెడ్పీటీసీ వేణు, ఎంపీటీసీ కిశోర్, నాయకులు రాము, వార్డు సభ్యులు సోమేశ్వర్, శ్రావణ్, నాగయ్య, కిషన్, ఉపేంద్ర, యాకమ్మ ఉన్నారు.

81
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles