బయ్యారంలో ఫ్యాక్టరీ నిర్మించాలి

Fri,February 15, 2019 01:38 AM

బయ్యారం ,ఫిబ్రవరి 14 : అపార ఇనుప ఖనిజ సంపద కలిగిన బయ్యారంలో కేంద్ర ప్రభుత్వం ఉక్కు పరిశ్రమ నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క అన్నారు. పరిశ్రమ సాధనే ధ్యేయంగా 36 గంటల పాటు ఇల్లందు ఎమ్మెల్యే హరిప్రియ దీక్ష చేపట్టగా విక్రమార్క నిమ్మరసం అందించి విరమింపజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజల చిరకాల స్వప్నమైన ఉక్కు పరిశ్రమకు రాష్ట్ర పునర్విభజన చట్టంలో పొందిపర్చి ఆమోదింపజేసిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనన్నారు. కానీ, పరిశ్రమ ఏర్పాటుపై కేంద్రం నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరికాదన్నారు. విభజన హామీలను అమలు చేయాల్సిన బాధ్యత కేంద్రానిదే అన్నారు. ఐదేళ్లుగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పరిశ్రమ ఏర్పాటుపై స్పష్టమై న హామీ ఇవ్వకుండా సర్వేల పేరుతో కాలయాపన చేస్తోందని విమర్శించారు. పరిశ్రమ ఏర్పాటుతో స్థానికంగా వేలాది మంది యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నా రు. బయ్యారంలో ఉక్కు పరిశ్రమ నిర్మించే వరకూ పోరాటం చేస్తామన్నారు. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే పరిశ్రమను ప్రారంభిస్తామని స్పష్టం చేశారు. దీక్షకు మనుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్, రాజ్యసభసభ్యుడు వీ హనుమంతరావు, మాజీ కేంద్ర మంత్రి పోరిక బలరాంనాయక్, మానుకోట జిల్లా అధ్యక్షుడు భరత్‌చందర్‌రెడ్డి, ఆదివాసీ జాతీయ నాయకుడు బెల్లయ్యనాయక్ తదితరులు సంఘీభావం పలికారు.

53
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles