హరిత లక్ష్యం 2.82 కోట్లు

Thu,February 14, 2019 01:42 AM

-302 గ్రామ పంచాయతీల్లో నర్సరీలు
-నాటిన ప్రతీ మొక్కకు రక్షణ
మహబూబాబాద్ జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ: జిల్లాను పచ్చనిహారంగా మార్చేందుకు జిల్లా యంత్రాంగం సిద్ధమైంది. ఈ ఏడాది 2.82 కోట్లు మొక్కల పెంపక లక్ష్యంగా నిర్ణయించారు. ఇందులో గ్రామీణాభివృద్ధిశాఖ 2 కోట్లు కాగా, అటవీశాఖ ద్వారా 82 లక్షల మొక్కలు పెంచుతున్నారు. ఇప్పటికే అటవీశాఖ ద్వారా 8 నర్సరీల్లో మొక్కల పెంపకం ప్రారంభించారు. అదేవిధంగా డీఆర్డీవో ద్వారా 302 గ్రామ పంచాయతీల్లో నర్సరీలు ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. పర్యావరణ పరిరక్షణతోపాటు అడవులు అంతరించిపోకుండా ఉండేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందులోభాగంగా ఇటీవల అటవీ చట్టాన్ని కూడా మార్పులు చేపట్టింది. అడవిలో ఉన్న చెట్లను నరికినా, అటవీ భూమిని పోడు చేసినా, అటవీ సంపదను అక్రమంగా తరలించినా వారిపై కఠినంగా వ్యవహరించనున్నట్లు నిర్ణయించారు. ఇందులో భాగంగా ఇప్పటికే జిల్లాలో 11 మంది స్మగ్లర్లపై పీడీ యాక్టు కేసులు నమోదు చేసేందుకు సిద్ధం చేశారు. ప్రభుత్వం ప్రతీ ఏటా కోట్ల రూపాయలు వెచ్చించి మొక్కలు నాటుతుంటే వాటిని రక్షించాల్సిందిపోయి కొంత మంది అక్రమార్కులు అడవిని అంతం చేస్తున్నారు. ఇది గుర్తించిన ప్రభుత్వం ఇకపై ఉపేక్షించేది లేదని తేల్చిచెప్పింది.

దీనిలో భాగంగా ప్రతి ఏటా జిల్లాకు ఉన్న టార్గెట్‌ను మూడింతలకు పెంచా రు. గత ఏడాది 96 లక్షలు ఉన్న హరితహారం లక్ష్యాన్ని ఈ సంవత్సరం ఏకంగా 2.82 కోట్లకు పెంచారు. ఇందులో 40 శాతం టేకు, 20 శాతం నీడనిచ్చే మొక్కలు, 20 శాతం పూల మొక్కలు, 20 పండ్ల మొక్కలు ఉన్నాయి. హరితహారం కార్యక్రమం ద్వారా నాటిని ప్రతీ మొక్కను క్షేత్రస్థాయిలో పరిశీలించి వాటి సంరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ఈసారి గ్రామస్థాయిలో నాటే మొక్కలకు సర్పంచ్‌తోపాటు ఆ గ్రామ కార్యదర్శి, వీఆర్వో, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు బాధ్యత వహించనున్నారు. గ్రామ పంచాయతీలో ముఖ్యంగా హరితహారం కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. జిల్లా వ్యాప్తంగా 461 పంచాయతీలు ఉండగా ఇందులో 302 పంచాయతీల్లో మొ క్కలు నాటాలని జిల్లా గ్రామీణాభివృద్ధిశాఖ అధికారులు నిర్ణయించారు.

ప్రతీ పంచాయతీకి ఒక నర్సరీ తప్పకుండా ఉండాలనే నిబంధన ను అధికారులు తప్పనిసరి చేస్తున్నా రు. జిల్లాలో 461 గ్రామ పంచాయతీలకు 302 గ్రామాల్లో నర్సరీలను ఏర్పా టు చేసేందుకు అధికారులు ఇప్పటికే స్థలాలను గుర్తించారు. గుర్తించిన స్థలాల్లో నర్సరీలను ఏర్పాటు చేసి మొక్కల పెంపకం చేపట్టనున్నారు. హరితహారం కార్యక్రమం ప్రారంభం కాగానే 3, 4 గ్రామ పంచాయతీలను ఒక క్లస్టర్‌గా విభజించి మొక్కలు రవాణా చేసేందుకు చర్య లు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా రోడ్లకు ఇరువైపులా మొక్కలు ఉండేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ప్రతీ గ్రామ పం చాయతీలో అర ఎకరం స్థలంలో నర్సరీ ఏర్పాటు చేయాలని గ్రామీణాభివృద్ధిశాఖ అధికారులు నిర్ణయించారు. ఆ గ్రామ పంచాయతీ పరిధిలో ఉండే ప్రాంతాలకు అవసరమయ్యే మొక్కలను పెంచనున్నారు. తద్వారా హరితహారం కార్యక్రమం సందర్భంలో రవాణాకు ఎలాం టి అసౌకర్యం లేకుండా సులువుగా ఉంటుందని అధికారులు భావిస్తున్నా రు. ఈసారి హరితహారం కార్యక్రమంలో అత్యధికంగా 40 శాతం టేకు మొక్కలను పెంచనున్నారు. అదేవిధంగా 20 శాతం నీడనిచ్చే మొక్కలు, 20 శాతం పూల మొక్కలు, మ రో 20 శాతం పండ్ల మొక్కలను నర్సరీలో పెంచుతున్నారు. గతేడాది మిగిలిన 20 లక్షల మొక్క లు ఇంకా నర్సరీల్లోనే పెరుగుతున్నాయి. వచ్చే ఏడాది హరితహారం లక్ష్యం భారీగా ఉండటంతో జూన్ నాటికల్లా నర్సరీల్లో మొక్కలను సిద్ధం చేసి ఉంచాలని అధికారులు భావిస్తున్నారు.

ప్రతీ మొక్కకు రక్షణ
నాటే ప్రతీ మొక్కకు రక్షణ కల్పించేందుకు అధికారులు క్షేత్రస్థాయిలో చర్యలు తీసుకుంటున్నారు. జంగిల్ బడావో-జంగిల్ బచావో నినాదంతో ప్రభుత్వం ముందుకు సాగుతున్న విషయం తెలిసిందే. మొక్కలను కాపాడేందుకు క్షేత్రస్థాయిలో రక్షణ దళాలను ఏర్పాటు చేస్తున్నారు. గ్రామస్థాయిలో సర్పంచ్ అధ్యక్షతన కమిటీని నియమించనున్నా రు. ఆ కమిటీ నిత్యం మొక్కలను పర్యవేక్షించనున్నారు. అదేవిధంగా 600 పైగా నాటిన మొక్కలకు ప్రభుత్వం ప్రతీ నెలా నిర్వహణ ఖర్చులను కూడా ఇస్తుంది. ఒక మొక్కకు రూ.5 చొప్పున ప్రభుత్వం చెల్లిస్తుంది. ఇటీవల కలెక్టర్ సీహెచ్ శివలింగయ్య అధ్యక్షతన అధికారులు సమీక్షా స మావేశం నిర్వహించారు. హరితహారంలో చేపట్టాల్సిన అం శాలపై డీఆర్డీవో, అటవీశాఖ తదితర శాఖలకు కలెక్టర్ మార్గనిర్దేశం చేశారు. హరితహారాన్ని ప్రతి ఒక్కరూ ఛాలెంజ్‌గా తీసుకుని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఏ శాఖకు కేటాయించిన లక్ష్యాన్ని ఆ శాఖ పూర్తిచేసే విధంగా ఇప్పటి నుంచే ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని ఆదేశించారు.

78
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles