కురవి అభివృద్ధికి ప్రత్యేక కృషి


Thu,September 13, 2018 01:34 AM

-గ్రంథాలయ అభివృద్ధికి రూ.10లక్షల మంజూరు
-తాజా మాజీ ఎమ్మెల్యే రెడ్యానాయక్
-కురవి నుంచి ఉగ్గంపల్లికి యువకుల బైక్ ర్యాలీ
చిన్నగూడూరు, సెప్టెంబర్2 : కురవి అభివృద్ధికి ప్రత్యేక కృషి చేయనున్నట్లు డోర్నకల్ తాజా మాజీ ఎమ్మెల్యే ధరంసోతు రెడ్యానాయక్ తెలిపారు. బుధవారం కురవి మండల కేంద్రం నుంచి ఉగ్గంపల్లి వరకు యువత బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఉగ్గంపల్లిలో ఎమ్మెల్యే రెడ్యా, టీఆర్‌ఎస్ యువ నాయకడు రవిచంద్రను మర్యాద పూర్వకంగా కలిసి వచ్చే ఎన్నికల్లో డోర్నకల్ టీఆర్‌ఎస్ అభ్యర్థిగా రెడ్యాను భారీ మెజార్టీతో గెలిపించేందుకు తమ వంతు సహకారం అందిస్తామని వారు హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా కురవి అభివృద్ధికి సహకరించాలని రెడ్యాను కోరారు. అనంతరం రెడ్యానాయక్ మాట్లాడారు. కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు నిరుపేదల పాలిట వరంగా మారాయన్నారు. కురవి మండల కేంద్రంలో గ్రంథాలయ నిర్మాణానికి రూ.పది లక్షలు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. వచ్చే సద్దుల బతుకమ్మ నాటికి బతుకమ్మ ఘాట్ వద్ద అన్ని సౌకర్యాలు కల్పిస్తామన్నారు. మండల కేంద్రంలో క్రీడామైదానానికి రూ.2లక్షలు మంజూరు చేయిస్తానని తెలిపారు. పారిశుధ్య పనులు, వీధిలైట్లు తక్షణమే ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. కేసీఆర్ సహకారంతో డోర్నకల్‌ను ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామన్నారు. అనంతరం రవిచంద్ర మాట్లాడారు. ప్రభుత్వ పథకాలపై యువత విస్తృత ప్రచారం న్విహించాలన్నారు. కేసీఆర్‌తోనే బంగారు తెలంగాణ సాధ్యమన్నారు. ఆ దిశగా ప్రతీ ఒక్కరు భాగస్వాములు కావాలని సూచించారు. రెడ్యా గెలుపును కాంక్షిస్తు తరలి వచ్చిన యువతకు రవిచంద్ర కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో నాయకులు సంగెం హరీంద్రవర్మ, దుడ్డెల వినోద్, కొణతం వెంకటేశ్, సంతోశ్, శ్రీకాంత్, శ్రీను, శరత్, మల్లికార్జున్, ప్రశాంత్, నాగరాజు, సంపత్ తదితరులు పాల్గొన్నారు.

113
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...