బీమా..రైతు ఇంటా ధీమా..

Thu,September 13, 2018 01:33 AM

మరిపెడ, నమస్తేతెలంగాణ : సీఎం కేసీఆర్ ఆగస్టు 15నుంచి అమలు చేస్తోన్న రైతుబీమా పథకం రైతు ఇంట ధీమాను నింపిందని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గుడిపుడి నవీన్ అన్నారు. బుధవారం మరిపెడ మండలం వీరారం శివారు భూక్యాతండాకు చెందిన భూక్యా దూఫ్యా (45) ఆగస్టు 24న రోడ్డు ప్రమాదానికి గురై ఖమ్మంలోని ఓ ప్రైవేట్ దవాఖానలో చికిత్స పొందుతూ అదేరోజు మృతి చెందాడు. మృతుడికి తల్లితండ్రులు, భార్య, ఓ కుమారుడు ఉన్నారు. ఐదెకరాల సాగు భూమి ఉంది. దీంతో ప్రభుత్వం ఈ కుటుంబానికి చెందిన దూఫ్యా, అతడి తండ్రి బోడియాకు రైతు బీమాను వర్తింప చేసే సర్కారే బీమా ప్రిమియం చెల్లించింది. ప్రమాదవశాత్తు దూఫ్యా మృతి చెందగా రూ.5లక్షల బీమా ఆ కుటుంబానికి అందింది.

రైతు బాంధవుడు సీఎం కేసీఆర్..
రైతు సంక్షేమమే ధ్యేయంగా ప్రవేశపెట్టిన రైతుబీమా పథకంతో రైతు బాంధవుడిగా సీఎం కేసీఆర్ చరిత్ర పుటల్లో నిలిచిపోనున్నారని గుడిపుడి నవీన్ అన్నారు. బుధవారం భూక్యా దూఫ్యా కుటుంబ సభ్యులకు రైతు బీమా చెక్కును అందజేశారు. సీఎం కేసీఆర్‌కు ఓటేస్తేనే రాష్ర్టాభివృద్ధి మరింత సాధ్యమన్నారు. ఎమ్మెల్యే రెడ్యానాయక్ రైతు బిడ్డగా కరెంట్ ఇబ్బందులు లేకుండా చూశారన్నారు. ప్రతీ రైతుకు రైతు బంధు పథకం అందేలా కృషి చేశారన్నారు. ఊరూరికి, తండాతండాకు తారు రోడ్డు సౌకర్యం కల్పించారన్నారు. సమావేశంలో మరిపెడ ఎంపీపీ తాళ్లపెల్లి రాణిశ్రీనివాస్, మానుకోట ఏఎంసీ మాజీ చైర్మన్ ఆర్ సత్యనారాయణరెడ్డి, రైతు సమితి మండల కోఆర్డినేటర్ చాపల యాదగిరిరెడ్డి, మరిపెడ తాజా మాజీ సర్పంచ్ పీ రాంలాల్, మాజీ ఎంపీపీ గుగులోత్ వెంకన్న, జిల్లా రైతు సమితి సభ్యులు జర్పుల కాలునాయక్, బొల్లం నర్సయ్య, దుస్స నర్సయ్య, పాండు, వెంకన్న, హరి, భరత్ తదితరులు పాల్గొన్నారు.

131
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles