నవరాత్రోత్సవాలను ప్రశాంతంగా జరుపుకోవాలి

Thu,September 13, 2018 01:33 AM

-ఈశ్వరయ్య, డీఎస్పీ మదన్‌లాల్
మరిపెడ, నమస్తేతెలంగాణ :గణపతి నవరాత్రి ఉత్సవాలను ప్రజలు, వినాయక భక్త మండలి బృందాలు ప్రశాంతంగా జరుపుకోవాలని తొర్రూర్ ఆర్డీవో ఈశ్వరయ్య, డీఎస్పీ మదన్‌లాల్ అన్నారు. బుధవారం మరిపెడ మండల్ పరిషత్ సమావేశపు హాల్‌లో వివిధ శాఖల అధికారులు, వివిధ గ్రామాల్లోని వినాయక భక్తమండలి బృందాలతో సమీక్ష నిర్వహించి వారు మాట్లాడారు. గణేశ్ ఉత్సవాల సందర్భంగా పోలీస్ చర్యలు, అధికారులు చేపడుతున్న బాధ్యతలు, విధులను వివరించారు. ఇందుకు భక్త బృందాలు సహకరించాలని కోరారు. వినాయక విగ్రహాల ఏర్పాటుకు పోలీస్ అనుమతి ఉండాలన్నారు. డీజే సౌండ్స్ పెట్టొద్దని హెచ్చరించారు. నిమజ్జనమప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించారు. లూస్ లైన్ వైర్లు ఉంటే తొలగించాలని ట్రాన్స్‌కో అధికారులకు సూచించారు. పీఎస్ గూడెం ఆకేరు బ్రిడ్జి వద్ద రాత్రి పూట కరంట్ సౌకర్యం కల్పించాలన్నారు. మరిపెడ మున్సిపల్ ప్రత్యేక అధికారి సూర్యనారాయణ, కమిషనర్ సింగారపు కుమార్, తహసీల్దార్ శ్రీనివాస్‌రెడ్డి, ఎస్సై ప్రసాదరావు, ఈవోపీఆర్డీ టీ రామకృష్ణ పాల్గొన్నారు.

123
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles