మానుకోటలో పారిశుధ్య పనులకు ప్రత్యేక చర్యలు


Thu,September 13, 2018 01:33 AM

మహబూబాబాద్ టౌన్: పట్టణంలో పారిశుధ్య పనులు చేసేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు మున్సిపల్ కమిషనర్ ఇంద్రసేనారెడ్డి అన్నారు. జిల్లాకేంద్రంలోని మున్సిపల్ కార్యాలయంలో అధికారులు, శానిటేషన్ సిబ్బందితో బుధవారం సమీక్షించారు. ప్రజలు తమ ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని కమిషనర్ సూచించారు. ఖాళీ స్థలాల్లో పిచ్చిమొక్కలు, చెత్తాచెదారం లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ప్రస్తుత వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున మురికి కాల్వలు, నీటి గుంతలు, చెత్తకుప్పలపై ఫాగింగ్ చేయించాలని అధికారులను ఆదేశించారు. పందులను పట్టణానికి దూరంగా తరలించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. సమస్యలుంటే 08179-240029 ఫోన్ చేయాలని ప్రజలను కోరారు. సమీక్షలో అధికారులు, సిబ్బంది రాజన్న, రామకృష్ణ, శ్రీహరి, అనిల్, సత్యనారాయణ, సుధాకర్, కిశోర్‌కుమార్, రమేశ్, నాగేశ్వర్‌రావు, శ్రీనివాస్ పాల్గొన్నారు.

109
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...