నిజాం చెరువులో గణేశ్ నిమజ్జనం..


Thu,September 13, 2018 01:32 AM

మహబూబాబాద్ టౌన్, సెప్టెంబర్ 12: జిల్లాకేంద్రానికి సంబంధించి గణేశ్ నిమజ్జనోత్సవాన్ని పట్టణంలోని నిజాం చెరువులో చేపట్టనున్నట్లు ఆర్డీవో డీ కొమురయ్య తెలిపారు. జిల్లాకేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో బుధవారం సంబంధిత మున్సిపల్ అధికారులు, వార్డు కౌన్సిలర్లతో సమావేశం నిర్వహించారు. తహసీల్దార్ విజయ్‌కుమార్ అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశంలో ఆర్డీవో మాట్లాడుతూ ప్రజలు శాంతియుతంగా గణేశ్ నవరాత్రి ఉత్సవాలు జరుపుకోవాలని కోరారు. ఉత్సవ కమిటీ నిర్వాహకులు నిబంధనలు అతిక్రమించొద్దని సూచించారు. ఈ మేరకు అధికారులు, వార్డు కౌన్సిలర్లు ఉత్సవ నిర్వాహకులను చైతన్య పర్చాలన్నారు. మానుకోట పట్టణంలో నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా స్థానిక నిజాం చెరువులో నిమజ్జన ఏర్పాట్లు చేస్తున్నట్లు స్పష్టం చేశారు. సమావేశంలో డీఎస్పీ ఆంగోత్ నరేశ్‌కుమార్, మున్సిపల్ చైర్‌పర్సన్ బీ ఉమ, మున్సిపల్ కమిషనర్ ఇంద్రసేనారెడ్డి, టీఆర్‌ఎస్ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ మార్నేని వెంకన్న, సీపీఐ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బీ అజయ్, వార్డు కౌన్సిలర్లు చెట్ల జయశ్రీ, యాళ్ల పుష్పలత, భూక్యా లక్ష్మి, నిమ్మల శ్రీను తదితరులు పాల్గొన్నారు.

114
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...