సీఎం కేసీఆర్‌తోనే రాష్ట్రం సుభిక్షం

Thu,September 13, 2018 01:32 AM

కేసముద్రంటౌన్, సెప్టెంబర్ 12: సీఎం కేసీఆర్‌తోనే తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించి సుభిక్షంగా ఉంటుందని మహబూబాబాద్ తాజా మాజీ ఎమ్మెల్యే మాలోత్ శంకర్‌నాయక్ అన్నారు. టీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో మండలంలోని పలు గ్రామాల్లో ఓటరు నమోదు కార్యక్రమాన్ని చేపట్టారు. కేసముద్రం విలేజ్‌లో చేపట్టిన కార్యక్రమానికి శంకర్‌నాయక్ హాజరైన మాట్లాడారు. పోరాడి సాధించుకున్న రాష్ర్టాన్ని బంగారు తెలంగాణగా మార్చేందుకు సీఎం కేసీఆర్ నిరంతరం కృషి చేస్తున్నారని కొనియాడారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం కులమతాలకతీతంగా సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతూ పేద ప్రజల సంక్షేమానికి పెద్దపీట వేస్తోందన్నారు.
అన్నదాతల సంక్షేమం కోసం..
గత ప్రభుత్వాల హయాంలో అన్నదాతలను పట్టించుకున్న నాథుడే లేడని శంకర్‌నాయక్ అన్నారు. టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చాక పంట రుణాలు మాఫీ, 24 గంటల విద్యుత్, పెట్టుబడి సాయం, రైతు బీమా, సబ్సిడీ పనిముట్లు తదితర పథకాలతో రైతన్నలకు వెన్నుదన్నుగా నిలుస్తోందన్నారు. ఇలాంటి పథకాలు ప్రపంచంలో మరెక్కడా లేవన్నారు. వ్యవసాయానికి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు మిషన్ కాకతీయ పథకంతో చెరువులు, కుంటలను పునరుద్ధరిస్తున్నట్లు చెప్పారు. తద్వారా నియోజకవర్గంలో సాగు విస్తీర్ణం బాగా పెరిగిందన్నారు. కాళేశ్వరం వంటి సాగునీటి ప్రాజెక్టులతో తెలంగాణ సస్యశ్యామలం అవుతుందన్నారు. పేదల కోసం అమలు చేస్తున్న కల్యాణలక్ష్మి, కేసీఆర్ కిట్టు, ఆసరా పెన్షన్ పథకాలు ఆర్థిక ప్రయోజనం చేకూరుస్తున్నట్లు వివరించారు. వచ్చే ఎన్నికల్లో కారుగుర్తుకు ఓటు వేసి మళ్లీ కేసీఆర్‌ను సీఎంగా చూడాలని పిలుపునిచ్చారు. నూతన ఓటర్లను ఆకట్టుకునే విధంగా కార్యకర్తలు కృషి చేయాలని, పార్టీ బలోపేతానికి సైనికుడిలా పని చేయాలని సూచించారు. కేసముద్రం విలేజ్‌కి చెందిన తోట మానస నుంచి ఓటు హక్కు నమోదు వివరాలు సేకరించారు. ఈ సందర్భంగా మానస మాట్లాడుతూ తాను కల్యాణలక్ష్మి ద్వారా రూ. 51,116 పొందానని చెప్పారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్ నాయకులు డాక్టర్ పాల్వాయి రామ్మోహన్‌రెడ్డి, దామరకొండ ప్రవీణ్‌కుమార్, రావుల శ్రీనాథ్‌రెడ్డి, మోడెం రవీందర్‌గౌడ్, గుతప రమేశ్, కముటం శ్రీను, ఈసం లక్ష్మీనారాయణ, గుతప మణి, కొల్లూరి శ్రీను పాల్గొన్నారు.

88
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles