గణేశ్ నిమజ్జన ఏర్పాట్ల పరిశీలన


Thu,September 13, 2018 01:32 AM

-సభలు, సమావేశాలకు రాజకీయ నాయకులు పోలీసుల అనుమతి తీసుకోవాలి
-డీఎస్పీ నరేశ్‌కుమార్
మహబూబాబాద్ క్రైం : జిల్లా కలెక్టర్, ఎస్పీ ఆదేశాల మేరకు ఈ సారి గణేశ్ నిమజ్జనం నిజాం చెరువులోనే చేయాలని డీఎస్పీ నరేశ్‌కుమార్ అన్నారు. గణేశ్ నిమజ్జనం సందర్భంగా మున్నేరు బ్రిడ్జి ప్రదేశాన్ని పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఏడాదీ మున్నేరువాగు వద్ద నిమజ్జనాలు చేస్తారని, ఈ ఏడాది మిషన్ భగీరథ పథకం పైపులైను పిల్లర్లు వేయగా, అక్కడ నిమజ్జనానికి అవకాశం లేదన్నారు. దీంతో ముందస్తు చర్యగా ఈ నెల 10న కలెక్టర్ జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించి నిమజ్జనాన్ని నిజాం చెరువులో చేసేలా చర్యలు తీసుకోవాలని పలు సూచనలు, సలహాలు చేశారని డీఎస్పీ తెలిపారు. చెరువును సందర్శించిన వారిలో వివిధ శాఖల అధికారులున్నారు. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనుండగా, శాంతిభద్రతల దృష్ట్యా రాజకీయ పార్టీలు, వివిధ ప్రజా సంఘాలు చేపట్టే సభలు, సమావేశాలు, ర్యాలీల కోసం ముందస్తుగా పోలీసుల అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని డీఎస్పీ నరేశ్‌కుమార్ అన్నారు. ఏక కాలంలో వివిధ పార్టీలు ర్యాలీలు, మీటింగ్‌లు, బస్సు యాత్రలు, పాదయాత్రలు ఒకే రూట్‌లో, ఒకే సమయంలో, ఒకే స్థలంలో ఏర్పాటు చేసుకోవడం అనుకోకుండా ఒక్కొక్కసారి సంభవిస్తుందన్నారు. పర్యావసానంగా గొడవలు, ఉద్రిక్త పరిస్థితులు ఉత్పన్నం అయ్యే అవకాశం ఉంటుందని అన్నారు. ఆయా కార్యక్రమాలు శాంతియుతంగా జరుపుకోవడానికి పోలీసు బందోబస్తు ఏర్పాటుకు అనుకూలంగా ఉంటుంది. అన్నివర్గాల ప్రజలు అందుకు సహకరించాలని డీఎస్పీ విజ్ఞప్తిచేశారు.

88
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...