ఎన్డీపార్టీ సానుభూతిపరుడి అరెస్ట్


Thu,September 13, 2018 01:30 AM

గూడూరు: సీపీఐఎంల్ (న్యూడెమోక్రసీ) పార్టీ సానుభూతిపరుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు పంపినట్లు సీఐ బాలాజీ తెలిపారు. బుధవారం స్థానిక విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గతంలో ఎన్డీపార్టీ రాయలవర్గం డివిజన్ కార్యదర్శి సంగా పొంగు ముత్తయ్య, అలియాస్ పుల్లన్న అరెస్టు చేయగా, కోర్టు అనుమతితో పోలీస్ కస్టడీలోకి తీసుకుని విచారించామన్నారు. పుల్లన్న తెలిపిన సమాచారం మేరకు గంగారం మండలంలోని పెద్దఎల్లాపురంలో ఉంటున్న నెమురుకొమ్ముల వీరన్నను ఆయన ఇంటి వద్ద అరెస్టు చేసి తీసుకుని వచ్చినట్లు, ఇతడే 25ఏళ్లుగా ఎన్డీపార్టీకి సానుభూతిపరుడిగా ఉన్నాడు. ఈ క్రమంలో వారికి భోజనాలు, కాంట్రాక్టర్ల వద్ద డబ్బులు వసూలు చేసి ఇవ్వడం, పోడు భూముల విషయంలో ఫారెస్టు అధికారులను బెదిరించడం, తుపాకీ, తుటాలను తన ఇంట్లో దాచడం వంటివి చేస్తుండేవాడని, దీంతో వీరన్నను అరెస్టు చేసి రిమాండ్‌కు పంపినట్లు సీఐ తెలిపారు. ఈ సమావేశంలో ఎస్సై యాసిన్, కానిస్టేబుళ్లు పాల్గొన్నారు.

99
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...