కేసీఆర్ పథకాలే టీఆర్‌ఎస్‌కు శ్రీరామరక్ష

Wed,September 12, 2018 03:17 AM

-తాజా మాజీ ఎమ్మెల్యే డీఎస్ రెడ్యా
-కందికొండలో టీఆర్‌ఎస్‌లో 30 కుటుంబాల చేరిక
చిన్నగూడూరు, సెప్టెంబర్ 11: వేల కోట్ల రూపాయలు వెచ్చించి.. సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే వచ్చే ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ను మళ్లీ గెలిపించేందుకు శ్రీరామ రక్షగా నిలుస్తాయని డోర్నకల్ తాజా మాజీ ఎమ్మెల్యే డీఎస్ రెడ్యానాయక్ అన్నారు. కురవి మండలంలోని కందికొండకు చెందిన కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్ష, ఉపాధ్యక్షులు బండి వెంకన్న, సుధాకర్‌తోపాటు ఆయా పార్టీలకు చెందిన 30 కుటుంబాలు మంగళవారం ఉగ్గంపల్లిలోని డీఎస్ రెడ్యానాయక్ నివాసంలో టీఆర్‌ఎస్‌లో చేరాయి. ఈ సందర్భంగా రెడ్యా వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

కేసీఆర్‌తోనే తెలంగాణ అభివృద్ధి
సీఎం కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్‌ఎస్ ప్రభుత్వంతోనే తెలంగాణ రాష్ట్రం అన్ని విధాలా అభివృద్ధి సాధిస్తోందని రెడ్యానాయక్ అన్నారు. నేడు దేశంలోనే తెలంగాణ ఆదర్శంగా నిలుస్తోందని చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో కుల వృత్తులను ప్రోత్సహిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ పునరుజ్జీవం పోస్తున్నారని కొనియాడారు. గ్రామాల్లో వలసల నివారణకు ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టిందన్నారు. పేదల కోసం అనేక అభివృద్ధి పథకాలు ప్రవేశపెడుతూ సీఎం కేసీఆర్ వెన్నుదన్నుగా నిలుస్తున్నారని వివరించారు.

తండాతండాకు తారురోడ్డు..
నియోజకవర్గంలోని ప్రతీ తండా, మారుమూల పల్లెలకు సైతం తారురోడ్లు నిర్మించాకే ఓట్ల కోసం వస్తానని ఇచ్చిన మాటకు కట్టుబడినట్లు రెడ్యానాయక్ చెప్పారు. ఇప్పటికే 90 రోడ్ల నిర్మాణ పనులు పూర్తయ్యాయని గుర్తుచేశారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా వచ్చే గోదావరి జలాలతో ప్రతీ చెరువును నింపేందుకు కృషి చేస్తున్నామన్నారు. వచ్చే నవంబర్ నాటికి ఇంటింటికీ శుద్ధి చేసిన తాగునీరు అందించి, డోర్నకల్‌ను ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దే లక్ష్యంతో పని చేస్తున్నట్లు తెలిపారు. ప్ర భుత్వ సంక్షేమ పథకాలు, నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనులకు ఆకర్శితులై ఆయా గ్రామాలకు చెందిన వందలాది మంది టీఆర్‌ఎస్‌లో చేరుతున్నట్లు రెడ్యా చెప్పారు. టీఆర్‌ఎస్‌లో చేరిన వారిలో వెంకన్న, సుధాకర్ కొండ్ర యాకయ్య, సైదులు, బుగేంధర్, కొప్పుల ఉప్పలయ్య, మహేందర్, మహేశ్, ఉప్పలయ్య, రమేశ్ తదితరులు ఉన్నారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్ మండల నాయకులు పిచ్చిరెడ్డి, బండి యతిరాజ్, మాధవ్, ఉప్పలయ్య, నర్సయ్య ఉన్నారు.

101
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles