రెడ్యానాయక్ విస్తృత ప్రచారం


Wed,September 12, 2018 03:15 AM

కురవి, సెప్టెంబర్11 : డోర్నకల్ నియోజకవర్గంలో తాజా మాజీ ఎమ్మెల్యే డీఎస్ రెడ్యానాయక్ ఎన్నికల ప్రచారం విస్తృతంగా చేపడుతున్నారు. ప్రధాన విపక్షాల నాయకులతోపాటు ఇతర పార్టీల్లో అసంతృప్తిగా ఉన్న నాయకులను సైతం టీఆర్‌ఎస్ అండగా ఉంటుందని భరోసా కల్పిస్తున్నారు. ప్రచారంలో భాగంగా మండలంలోని నేరడలో మంగళవారం ముఖ్య నాయకులు, కార్యకర్తలను ఆయన కలిశారు. ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు, అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. నేరడ గ్రామానికి చెందిన టీఆర్‌ఎస్ సీనియర్ నాయకుడు కొర్ని రవీందర్, గొట్టిముక్కుల వెంకట్‌రెడ్డిని వేర్వేరుగా కలిశారు. పార్టీ కోసం పనిచేసే ప్రతీ కార్యకర్తకు బంగారు భవిష్యత్ ఉంటుందన్నారు. ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ను గెలిపించుకునేందుకు ప్రతీ ఒక్కరూ సైనికుల్లా పని చేయాలని కోరారు. ఎన్నికల మ్యానిఫెస్టోలో లేని 76 ప్రజా సంక్షేమ పథకాలను అమలు చేసిన ఘనత కేసీఆర్‌కే దక్కిందన్నారు. నియోజకవర్గం అభివృద్ధి బాటలో ముందుందన్నారు. అలాగే సీపీఎం నాయకుడు దుస్స సాయిలు అనారోగ్యంతో బాధపడుతున్నాడని తెలుసుకుని, రెడ్యానాయక్ సాయిలును కలిసి ఆరోగ్య పరిస్థితులపై అడిగి తెలుసుకున్నారు.

టీడీపీ నాయకుడిని కలిసిన రెడ్యా..
టీడీపీ కురవి మండలానికి చెందిన నూతక్కి ప్రసాదరావును తాజా మాజీ ఎమ్మెల్యే రెడ్యానాయక్ కలిశారు. తాజా రాజకీయాలపై ప్రసాదరావుతో చర్చించారు. రానున్న ఎన్నికల్లో తనకు మద్దతుగా నిలవాలని కోరారు. ఆయా కార్యక్రమాల్లో టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు తోట లాలయ్య, అధికార ప్రతినిధి బజ్జూరి పిచ్చిరెడ్డి, దొడ్డ గోవర్ధన్‌రెడ్డి, మల్లెపాక మధు, చొక్కయ్య తదితరులు పాల్గొన్నారు.

112
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...