కలెక్టర్ సీహెచ్ శివలింగయ్య


Wed,September 12, 2018 03:14 AM

మహబూబాబాద్ టౌన్, సెప్టెంబర్11 : రైతులు సబ్సిడీపై విత్తనాలు పొందాలని కలెక్టర్ సీహెచ్ శివలింగయ్య అన్నారు. మంగళవారం మహబూబాబాద్ పట్టణంలో ఆగ్రోస్ రైతు సేవా కేంద్రం వద్ద కలెక్టర్ సీహెచ్ శివలింగయ్య యాసంగిలో వేరుశనగ విత్తనాల పంపిణీ కార్యక్రమం ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ రైతులను ఉద్దేశించి మాట్లాడారు. మహబూబాబాద్ జిల్లా వేరుశనగ పంటకు ప్రసిద్ధి అని తెలిపారు. రైతులకు ముందుగానే విత్తనాలు అందుబాటులోకి తెచ్చామని అన్నారు. వీటి పూర్తి ధర ఒక కేజీకి రూ.64 ఉంటే సబ్సిడీ రూ.22.40 వర్తిస్తుందన్నారు. రైతులందరికీ సరిపడా విత్తనాలు వ్యవసాయశాఖ వద్ద ఉన్నాయని, సంబంధిత వ్యవసాయ అధికారి కార్యాలయంలో సంప్రదించి పర్మిట్‌ను పొంది ఆగ్రోస్ సెంటర్‌లో, పీఏసీఎస్‌ల్లో విత్తనాలను పొందవచ్చునని, ఈ అవకాశాన్ని రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. విత్తనాల కోసం ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. రైతుల కార్యాలయానికి వచ్చేటప్పుడు విధిగా పట్టాదారు పాసు పుస్తకం, ఆధార్ జిరాక్స్ కాపీలు తీసుకురావాలన్నారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి ఛత్రునాయక్, జిల్లా ఉద్యాన అధికారి సూర్యనారాయణ, మండల వ్యవసాయాధికారి కే రామారావు, అభ్యుదయ రైతు వెన్నం సత్యనారాయణరెడ్డి, ఈవో సాయిప్రకాశ్ పాల్గొన్నారు.

100
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...