విద్యార్థులు చక్కటి నైపుణ్యాలను కలిగి ఉన్నారు


Wed,September 12, 2018 03:13 AM

-రాష్ట్ర పరిశీలన బృందం ప్రతినిధి ప్రేమ్ ఇలియాట్
- మోడల్ స్కూల్ సందర్శన
నెల్లికుదురు : నెల్లికుదురు మోడల్ స్కూల్ విద్యార్థులు విద్యలో చక్కటి నైపుణ్యాలను కలిగి ఉన్నారని మోడల్ స్కూళ్ల రాష్ట్ర పరిశీలిన బృందం ప్రతినిధి ప్రేమ్ ఇలియాట్ అన్నారు. మండల కేంద్రంలోని మోడల్ స్కూల్‌ను రాష్ట్ర బృంద మంగళవారం అకస్మికంగా తనిఖీ చేసింది. ఐదుగురితో కూడిన బృందం ఉదయం పాఠశాల నుంచి సాయంత్రం వరకు అన్ని తరగతులు తిరిగి ఉపాధ్యాయుల బోధన విధానం, విద్యార్థుల ప్రతిస్పందన క్షుణ్ణంగా పరిశీలించారు. పాఠ్య ప్రణాళికలు, టీచింగ్ డైరీలను పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రేమ్ మాట్లాడుతూ రాష్ట్ర ఉన్నత అధికారుల ఆదేశాలనుసారం పాఠశాలలో పర్యటించినట్లు తెలిపారు. రికార్డుల నిర్వాహణ సంతృప్తికరంగా ఉందన్నారు. నివేదికను రాష్ట్ర ఉన్నత అధికారులకు సమర్పించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో బృందం ప్రతినిధులు అమరావతి, సునీత, కృష్ణభాను, అక్తర్‌తో పాటు పాఠశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కే శ్రీనివాస్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

107
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...