టీఆర్‌ఎస్ వెంటే ప్రజలు..


Wed,September 12, 2018 03:13 AM

-వచ్చే ఎన్నికల్లో అధిక స్థానాలు మావే..
-సీఎం కేసీఆర్ వల్లే బంగారు తెలంగాణ
-తాజా మాజీ ఎమ్మెల్యే కోరం కనకయ్య
బయ్యారం, సెప్టెంబర్ 11: జనరంజక పాలన అందించిన టీఆర్‌ఎస్ వెంటే ప్రజలు ఉన్నారని తాజా మాజీ ఎమ్మెల్యే కోరం కనకయ్య అన్నారు. ఇల్లెందు నియోజకవర్గ అభ్యర్థి కోరం కనకయ్య మంగళవారం ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మండలకేంద్రంలో ర్యాలీ నిర్వహించి, అనంతరం బైక్‌లపై ఇల్లెందుకు బయల్దేరి వెళ్లారు. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత సీఎం కేసీఆర్ దేశంలో ఎక్కడా లేని పథకాలను తెలంగాణలో ప్రవేశపెట్టారని కొనియాడారు. ఉద్యమ పార్టీగా పురుడు పోసుకున్న టీఆర్‌ఎస్ నేడు రాష్ట్రంలో బలమైన రాజకీయ పార్టీగా ఎదిగిందన్నారు. మండలంలోని దశాబ్దాలుగా అభివృద్ధికి నోచుకోని అనేక రహదారులను నిర్మించినట్లు తెలిపారు. ప్రజల కష్టాలను గ్రామాల్లోకి వెళ్లి తెలుసుకున్నట్లు వివరించారు. ప్రజల ఆశీస్సులతో రానున్న రోజుల్లో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతానని ఇచ్చారు. ర్యాలీలో టీఆర్‌ఎస్ మండలాధ్యక్షుడు మూల మధుకర్‌రెడ్డి, ఎంపీపీ గుగులోత్ జయశ్రీ, మండల ప్రధాన కార్యదర్శి ఏనుగుల ఐలయ్య, ఎంపీటీసీ గోపాల్, నాయకులు రాసమళ్ల నాగేశ్వర్‌రావు, పెద్దినేని వెంకటేశ్వరావు, శ్రీకాంత్, వెంకటేశర్లు, శ్రీను పాల్గొన్నారు.

కేసీఆర్ పాలననే కోరుకుంటున్నారు
గార్ల: యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజలు మళ్లీ కేసీఆర్ పాలననే కోరుకుంటున్నారని కోరం కనకయ్య అన్నారు. ఇల్లందు నియోజకవర్గంలో తలపెట్టిన సమావేశానికి ఆయన టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు వడ్లమూడి దుర్గాప్రసాద్, పార్టీ కార్యకర్తలు, నాయకులతో కలిసి బైక్‌లపై ర్యాలీగా బయల్దేరి వెళ్లారు. ఈ సందర్భంగా కనకయ్య పటాకులను స్వయంగా కాల్చారు. ఆసరా పింఛన్లు మొదలు.. మొన్న అమలు చేసిన రైతుబంధు బీమా పథకం వరకూ.. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాల అమలు తీరును చూసి సర్వత్రా హర్షిస్తున్నారని చెప్పారు. దుర్గా ప్రసాద్ మాట్లాడుతూ.. మండల నలుమూలల నుంచి తొమ్మిది వందల బైకులు, 15 కార్లల్లో సుమారు రెండు వేల మంది ఇల్లందుకు బయల్దేరి వెళ్లినట్లు తెలిపారు. కార్యక్రమంలో తాజా మాజీ ప్రజాప్రతినిధులు భూక్యా నాగేశ్వరరావు, మాలోత్ వెంకట్‌లాల్, ఎద్దు మాధవి, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, టీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

101
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...