ఎన్నికలకు యంత్రాంగం ఏర్పాట్లు

Tue,September 11, 2018 02:19 AM

-ఈవీఎంల గోదాములు సిద్ధం
-చకచకా సాగుతున్న మరమ్మతు పనులు
-రెండు రోజుల్లో జిల్లాకు ఈవీఎంలు
మహబూబాబాద్ జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ : ఎన్నికలకు జిల్లా యంత్రాంగం సన్నద్ధమవుతోంది. కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి సీహెచ్ శివలింగయ్య సోమవారం ఎన్నికలకు సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించారు. ఆయనతోపాటు ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి, డీఎస్పీ నరేశ్‌కుమార్ నాయక్, ఏఆర్ డీఎస్పీ జనార్దన్‌రెడ్డి, ఆర్‌అండ్‌బీ ఈఈ శంకరయ్య, ఆర్డీవో కొమురయ్య, ఎన్నికల డీటీ చంద్రశేఖర్ సోమవారం కలెక్టరేట్ సమీపంలో ఉన్న ఈవీఎం గోదాంలను పరిశీలించారు. మరో రెండు రోజుల్లో జిల్లాకు ఈవీఎంలు చేరుకోనున్నాయని కలెక్టర్ తెలిపారు. ఈవీఎంలు భద్రపరిచే స్ట్రాంగ్ రూం మరమ్మతు పనులను వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు. 489 పోలింగ్ స్టేషన్లు 780 బ్యాలెట్ యూనిట్లు, 610 కంట్రోల్ యూనిట్లు, 660 వీవీ ప్యాట్స్ భద్ర పరిచేందుకు ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఈవీఎంల గోదాంల వద్ద గట్టి బందోబస్తుకు ఏర్పాటు చేయాలని ఎస్పీ నంద్యాల కోటిరెడ్డికి సూచించారు.

టాయిలెట్స్ నిర్మించాలని ఆర్‌అండ్‌బీ ఈఈ శంకరయ్యను ఆదేశించారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని ఇటీవల సీఎం కేసీఆర్ రద్దు చేయడం, ప్రభుత్వ రద్దును గవర్నర్ ఆమోదించడం. గోదాముల చుట్టూ ఫ్లడ్‌లైట్లు, ఈవీఎంలను పేర్చేందుకు , లోపలకు వెళ్లేందుకు, వచ్చేందుకు మెట్లను కొత్తగా నిర్మించాలని అలాగే తదితర సౌకర్యాలను కల్పించాలని ఆయా శాఖల అధికారులను కలెక్టర్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఆర్డీవోలు, తహసీల్దార్లతోపాటు ఎన్నికలకు సంబంధించిన డిప్యూటీ తహసీల్దార్లతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు. ఓటర్ల జాబితా నుంచి మొదలుకొంటే ప్రతీ ఒక్కటి పక్కాగా పూర్తిచేయాలని ఆదేశించారు. అనంతరం ఆయన మండలాల వారీగా ఓటర్ల జాబితాను అడిగి తెలుసుకున్నారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై ఆరా తీశారు. జిల్లా కేంద్రమైన తర్వాత మొదటిసారి జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో కలెక్టర్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. రిటర్నింగ్, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు పాటించాల్సిన నియమ నిబంధనలను సిబ్బందికి వివరించారు.

ఈవీఎంల గోదాం సిద్ధం..
రాష్ట్రంలో త్వరలో జరుగబోయే ఎన్నికల కోసం జిల్లా యంత్రాంగం ఏర్పాట్లను పూర్తి చేస్తుంది. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కూడ పూర్తి చేసే విదంగా పనులు సాగుతున్నాయి. మరో రెండు మూడు రోజుల్లో జిల్లాకు ఈవీఎంలు చేరుకోనున్నాయి. ఈనేపథ్యంలో జిల్లా యంత్రాంగం గోదాంల రిఫేరు పనులు పూర్తి చేస్తున్నారు. గోదాంల వద్ద నూతనంగా మెట్లను నిర్మిస్తున్నారు. అదే విదంగా గోదాంములకు ఇరువైపులా గేట్లను మరమ్మతులు చేస్తున్నారు. అంతే కాకుండా గోదాంలను లోపట బయట రంగులు వేసి శుబ్రం చేస్తున్నారు. గోదాంలో లోపట,బయట విద్యుత్ లైట్లను అమర్చుతున్నారు. గోదాం వద్ద ఉండే పోలిస్ సిబ్బందికి, ఇతర ఉద్యోగులకు సౌకర్యార్ధం టాయిలెట్స్ నిర్మాణ పనులు సాగుతున్నాయి. రెండు రోజుల్లో గోదాంలకు సంబందించిన పనులను చకచక పూర్తి చేసి సిద్దం చేసిన తరువాత జిల్లా యంత్రాంగం బెంగూళూరుకు వెళ్లి వాహనాల్లో ఈవీఎం పెట్టెలను జిల్లా కేంద్రానికి తీసుకరానున్నారు. ఈవీఎంలు జిల్లాకు వచ్చే సరికి గోదాం మరమ్మత్తుల పనులు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు.

ఓటర్ల జాబితాల తయారీలో నిమగ్నం
ఓటర్ల జాబితా తయారీలో యంత్రాంగం నిమగ్నమైంది. కొత్తగా చేరబోయే ఓటర్లతో పాటు ఓటర్ల జాబితా అభ్యంతరాల స్వీకరణ, స్పెషల్ డ్రైవ్ అన్ని పూర్తి చేసి తుది ఓటర్ల జాబితా ప్రకటించేందుకు సమయం ప్రకారం వెళ్లాలని కిందిస్థాయి అధికారులను ఆదేశించారు. ఓటర్ల జాబితాలో తప్పులను సరి చేయాలని ఆదేశించారు. మైగ్రేషన్, చనిపోయిన ఓటర్ల పేర్లను రెండుమార్లు సరి చూసిన తర్వాతనే తొలగించాలని సూచించారు. పోలింగ్ స్టేషన్లలో అన్ని సదుపాయాలు కల్పించాలని సూచించారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో భారీ బందోబస్తు ఏర్పాట్లన్నీ పర్యవేక్షించేలా చర్యలు చేపట్టాలని కలెక్టర్ శివలింగయ్య పోలిసులను ఆదేశించారు.

141
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles