బియ్యాన్ని నూకలుగా మార్చి..

Tue,September 11, 2018 02:19 AM

-అడ్డదారిలో రేషన్ బియ్యం విక్రయ దందా
-తొర్రూరులో 135 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్
-ముగ్గురిపై కేసు నమోదు
మహబూబాబాద్ జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ : రేషన్ బియ్యం అక్రమ రవాణాపై జిల్లాలో పోలీస్, రెవె న్యూ అధికారులు ఉక్కుపాదం మో పగా, వ్యాపారులు నయా దందాకు తెరలేపారు. బియ్యాన్ని ఇతర రాష్ర్టాలకు, ప్రాంతాలకు తరలించడం ఇబ్బందిగా మారడంతో ఎవరికీ అనుమానం రా కుండా ఉండేందుకు రేషన్ బి య్యాన్ని నూకలుగా మార్చి విక్రయించడం మొదలు పెట్టారు. ఈ తతంగంపై సమాచారం అందుకున్న రాష్ట్ర టాస్క్‌ఫోర్స్ అధికారులు సోమవారం గుట్టుచప్పుడు కాకుండా తొర్రూరు డివిజన్ కేంద్రంలోని శ్రీ ఉమామహేశ్వరి రైస్ మిల్లులో దాడులు నిర్వహించారు. ఈ సమయంలో రేషన్ బియ్యాన్ని నూకలుగా మార్చే విధానాన్ని చూసి అధికారులు అవాక్కయ్యారు. రేషన్ కార్డు కలిగి ఉన్న లబ్ధిదారుల వద్ద కేజీ రూ.7 నుంచి రూ.8 వరకు కొని వాటిని నూకలుగా మార్చి కోళ్ల ఫారాలు, ఇతర ప్రాంతాలకు రూ.13 నుంచి రూ.15 వరకు విక్రయిస్తున్నారు. రేషన్ బియ్యాన్ని ఓ హాల్‌లో పోసి వాటిపై నీటిని చల్లుతూ ఇనుప పార సాయంతో నూర్పిడి చేస్తున్నారు. తడికి బియ్యం నానడంతో వెంటనే అవి నూకగా మారుతున్నాయి. సాధారణంగా నూకల రవాణాకు అధికారులు అభ్యంతరం చెప్పే అవకాశాలు తక్కువ. దీంతో రేషన్ బియ్యాన్ని నూకలుగా మార్చి విక్రయిస్తున్న దందా అధికారులను సైతం ఆశ్చర్యానికి గురి చేసింది. రాష్ట్ర టాస్క్‌ఫోర్స్ ఓఎస్‌డీ రాజేశం, ప్రత్యేకాధికారులు లక్ష్మణ్‌రెడ్డి, లక్ష్మణ్‌రావు, స్థానిక పౌర సరఫరాల శాఖ డీటీ నారాయణరెడ్డి, ఎమ్మారై భాస్కర్‌తోపాటు ఎస్‌ఐ సీహెచ్ నగేశ్‌కు సమాచారం అందించి మిల్లులో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సమయంలో 120 క్వింటాళ్ల దొడ్డు నూకలను రవాణా కోసం సంచుల్లో నింపి ఉండటం, 15క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని నూకలుగా మార్చేందుకు ప్రక్రియ కొనసాగుతుండటంతో వీటిని సీజ్ చేశారు. ఈ దందాకు బాధ్యులైన ముగ్గురిపై 6-ఏ కేసులు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు.

118
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles