ప్రజా సంక్షేమమే సీఎం కేసీఆర్ లక్ష్యం

Tue,September 11, 2018 02:19 AM

-తాజా మాజీ ఎమ్మెల్యే బానోత్ శంకర్‌నాయక్
-రూ.7.38లక్షల సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ
మహబూబాబాద్ టౌన్ : రాష్ట్రంలోని అన్ని వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా సీఎం కేసీఆర్ ముందుకు సాగుతున్నారని తాజా మాజీ ఎమ్మెల్యే బానోత్ శంకర్‌నాయక్ అన్నారు. జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సోమవారం కేసముద్రం, గూడూరు, మహబూబాబాద్, నెల్లికుదురు మండలాలకు చెందిన 29 మందికి మంజూరైన సీఎంఆర్‌ఎఫ్ రూ.7.38లక్షల విలువైన చెక్కులను అందజేశారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆరోగ్యశ్రీ పథకం ద్వారానే కాకుండా ఆ పథకానికి వర్తించని జబ్బులతో బాధపడుతున్న వారిని ఆదుకునేందుకు సీఎం కేసీఆర్ రిలీఫ్ ఫండ్ ద్వారా ఆపన్నహస్తం అందజేస్తుందన్నారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతున్నారని, యావత్ రాష్ట్ర ప్రజలు సీఎం కేసీఆర్‌ను రానున్న ఎన్నికల్లో దీవించి మరోసారి ముఖ్యమంత్రిని చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్ నాయకులు మార్నేని వెంకన్న, గడ్డం అశోక్, ఉప్పలయ్య, సుదగాని మురళీగౌడ్, భూక్య ప్రవీణ్‌కుమార్, తేళ్ల శ్రీనివాస్, బానోత్ సోమ్లానాయక్, కాటా భాస్కర్, వీరన్న, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు. కాగా లబ్ధిదారులు గాండ్ల లక్ష్మి రూ.60వేలు, పీ పూరి రూ.9వేలు, జే లక్ష్మీనారాయణ రూ.30వేలు, ఎం వేణు రూ. 40వేలు, ముక్తార్ అహ్మద్ రూ.34వేలు, వీ వెంకన్న రూ.21వేలు, ఎన్ అండమ్మ రూ.15వేలు, సీహెచ్ గోపి రూ.16వేలు, ఓ యాదమ్మ రూ.40వేలు, జే రవి రూ.12వేలు, ఆర్ ఉమారాణి రూ.14వేలు, పీ రజిని రూ.6,500, కే ఉపేందర్ రూ.60వేలు, ఎస్ సునీత రూ.60వేలు, వీ సాంబశివరావు రూ.60వేలు, ఎండీ రహమాన్ రూ.16వేలు, డీ సాంబయ్య రూ.8,500, బీ శారద రూ.12వేలు, జీ చిత్కు రూ.18వేలు, జే బాలు రూ.5వేలు, బీ సుష్మిత రూ.36వేలు, బీ లాలీ రూ.18వేలు, ఎస్ రామచంద్రారెడ్డి రూ.60వేలు, బీ సునీత రూ.12వేలు, సీహెచ్ పవన్‌కుమార్ రూ.12 వేలు, ఎం ప్రణయ్ రూ.5,500, జే కమలమ్మ రూ.20 వేలు, బీ శివాజీ రూ.22వేలు, ఏ ప్రశాంత్‌కుమార్ రూ.16వేల విలువైన చెక్కులు అందజేశారు.

ప్రభుత్వ పథకాలను ప్రజల్లో తీసుకెళ్లాలి
కేసముద్రంటౌన్: పేద ప్రజల అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని టీఆర్‌ఎస్ అభ్యర్థి బానోత్ శంకర్‌నాయక్ పార్టీ కార్యకర్తలకు సూచించారు. సోమవారం మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్‌లో టీఆర్‌ఎస్ పార్టీ సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. గ్రామాలలో బూత్ కమిటీలను వేయాలని, కొత్త ఓటర్ల పేర్లను నమోదు చేయించాలని సూచించారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్ నాయకులు బీరవెళ్లి భరత్‌కుమార్‌రెడ్డి, డాక్టర్ పాల్వాయి రామ్మెహన్‌రెడ్డి, ఘనపురపు అంజయ్య, ఊకంటి యాకూబ్‌రెడ్డి, పోలెపల్లి నెహ్రూరెడ్డి, దామరకొండ ప్రవీణ్‌కుమార్, మారెపల్లి మాధవి, ఓలం చంద్రమోహన్, బొబ్బిలి మహేందర్‌రెడ్డి, మోడెం రవీందర్‌గౌడ్, నజీర్ అహ్మద్, కదిర సురేందర్,రావుల శ్రీనాథ్‌రెడ్డి, వేం సంపత్‌రెడ్డి, గుగులోత్ భద్రూనాయక్, భట్టు శ్రీను, నల్ల కిరణ్, శ్రీరామోజ్ మహేశ్వరాచారి, మార్నేని వెంకన్న, అన్నారపు యాకయ్య పాల్గొన్నారు.

సైనికుల్లా పనిచేస్తే గెలుపు ఖాయం
గూడూరు : ప్రతీ ఒకరు నిద్రహారాలు మాని టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌ను స్ఫూ ర్తిగా తీసుకొని ప్రతీ కార్యకర్త సైనికుడిలా పనిచేయాలని తాజా మాజీ ఎమ్మెల్యే బానోత్ శంకర్‌నాయక్ అన్నారు. సోమవారం స్థానిక టీఆర్‌ఎస్ కార్యాలయంలో మండలస్థాయి కో ఆర్డినేటర్ల సమావేశంలో మాట్లాడారు. సీఎం కేసీఆర్ ఆశీస్సులతో మళ్లీ అవకాశం వచ్చిందని ఈ అవకాశం తనదికాదని ప్రతి కార్యకర్తదని అన్నారు. ప్రతీ గ్రామాన్ని గులాభీవనం చేయాలన్నారు. తాను నియోజకవర్గ అభివృద్ధికి గత నాలుగేళ్లుగా రాత్రింభవల్లు కష్టపడ్డానని ఈ సందర్భంలో ఎవరినైనా అనుకోకుండా బాధపెడితే క్షమించాలని, తనకు వ్యక్తిగత ద్వేషాలు లేవని, అందరూ తన సోదరుల్లాంటి వారన్నారు.

మండలం నుంచి 15వేల మెజార్టీ ఇస్తాం
ఈ సందర్భంగా రాష్ట్రనాయకుడు బీరవెళ్లి భరత్‌కుమార్‌రెడ్డి, జెడ్పీటీసీ ఖాసీం, దామర నర్సయ్య, వేం వెంకటకృష్ణారెడ్డిలు మాట్లాడుతూ 15వేల మెజార్టీ మండలం నుంచి ఇస్తామని శంకర్‌నాయక్‌కు ఛాలెంజ్ చేశారు. కార్యక్రమంలో మార్నేనేని వెంకన్న, రామ్మెహన్‌రెడ్డి, అంజయ్య, జాగృతి మహిళ జిల్లా అధ్యక్షురాలు మారిపల్లి మాధవి, వేణుగోపాల్‌రెడ్డి, ముక్కా లక్ష్మణరావు, వైస్‌ఎంపిపి కిషన్, మాజీ సర్పంచ్ చీకటి శ్రీనివాస్, తులసీరాం, తాటి బుచ్చయ్య, ఏదునూరి వెంకన్న, సంపత్‌రావు, రాంచంద్రు, డీ మన్మోహన్‌రెడ్డి, కే శోభన్‌రెడ్డి, పీ కుమారస్వామి, కఠార్‌సింగ్, సురేందర్, రమేశ్ తదితరులు పాల్గొన్నారు.

103
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles