శక్తి వంచన లేకుండా పనిచేస్తా..

Tue,September 11, 2018 02:18 AM

నెల్లికుదురు, సెప్టెంబర్10 : మానుకోట నియోజకవర్గ ప్రజలకు సేవచేసే భాగ్యాన్ని కల్పిస్తూ కేసీఆర్ తనకు మరోసారి ఎమ్మెల్యే టికెట్ ప్రకటించారని, తన గెలుపు కోసం కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని, నియోజకవర్గ అభివృద్ధికి తాను శక్తి వంచనలేకుండా పని చేస్తానని తాజా మాజీ ఎమ్మెల్యే బానోత్ శంకర్‌నాయక్ అన్నారు. స్థానిక టీఆర్‌ఎస్ కార్యాలయంలో సోమవారం సాయంత్రం ఏర్పాటు చేసిన ముఖ్యకార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. టీఆర్‌ఎస్ పార్టీకి గెలుపేమీ కొత్తకాదని, పార్టీ తల్లిలాంటిదని, పార్టీ నిర్ణయానికి వ్యతతిరేకంగా పనిచేయకుండా కట్టుపడి ఉండాలని ఆయన అన్నారు. తనను అత్యధిక మెజార్టీతో గెలిపిస్తే ఇంటికి పెద్దన్ననై మిమ్ముల్ని కంటికి రెప్పలా కాపాడుతకుంటానని అన్నారు. తనకు కుట్రలు, కుతంత్రాలు తెలియవని ఆయన అన్నారు.
ప్రజలకు సేవ చేసుకునేందుకు తనకు అవకాశం వచ్చిందని, మళ్లీ తనను ఆదరిస్తే సేవకున్నై సేవలందిస్తానని శంకర్‌నాయక్ అన్నారు. కేసీఆర్ ఏ రాష్ట్రంలో లేని విధంగా 426 సంక్షేమ పథకాలను అమలు చేశారని, వాటన్నింటినీ అన్ని గ్రామాల్లో క్షేత్రస్థాయిలో ప్రతీ ఒక్కరికి చేరేందుకు కృషి చేశానన్నారు. ఇంకా కొన్ని పనుల చేయలేక పోయానని, మళ్లీ ప్రజలు ఆదరిస్తే ఎమ్మెల్యేగా వాటిన్నింటినీ పూర్తి చేస్తానని అన్నారు.

సర్వేల్లో పర్ఫెక్టు..
తన పనితనంపై పార్టీ అధిష్టానం నిర్వహించిన 14 సర్వేల్లోనూ తనే పర్ఫెక్టు అని తేలిందన్నారు. అర్ధరాత్రి తనింటి తలుపుతట్టినా పెద్దన్ననై సమస్యల పరిష్కారానికి పాటుపడుతానని తెలిపారు. గ్రామాల్లో కార్యకర్తలు, నాయకులు కష్టపడి నెల్లికుదురు మండలం నుంచి అత్యధిక మోజార్టీని అందవ్వాలని, అందుకు అంతా కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు.
పార్టీ నిర్ణయానికి

ప్రతీ ఒక్కరు కట్టుబడి ఉండాలి..
పార్టీ నిర్ణయానికి కట్టుపడి ప్రతీ ఒక్కరు పనిచేయాలని శంకర్‌నాయక్ అన్నారు. గ్రామాల్లో అందరూ సమన్వయంతో పనిచేసి తన గెలుపునకు కృషి చేయాలన్నారు. వజ్రాయుధం లాంటి తమ ఓటును తాకట్టు పెడుతారో.. కారు గుర్తుకు వేసి అత్యధిక మోజార్టీతో తనను గెలిపించి తెలంగాణ ఆత్మగౌరవాన్ని కాపాడుకుంటారో ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన బాధ్యత ప్రతీ ఒక్కరిపైన ఉన్నదన్నారు. బంగారు తెలంగాణ లక్ష్యంగా ముందుకు సాగిన, ప్రత్యేకాభివృద్ధి కార్యాచరణ కలిగిన కేసీఆర్‌కు ఓటు వేసి రుణం తీర్చుకోవాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్ మండల అధ్యక్ష, ప్రధానకార్యదర్శి గుగులోత్ బిక్కునాయక్, యాసం రమేశ్, రైతు సమితి జిల్లా కో-ఆర్డినేటర్ భూక్యా బాలాజీనాయక్, మండల కో-ఆర్డినేటర్ కాసం వెంకటేశ్వ్‌రెడ్డి, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ పరుపాటి వెంకట్‌రెడ్డి, ఆత్మ జిల్లా చైర్మెన్ పోలెపల్లి నెహ్రురెడ్డి, మండల మీడియా ఇంచార్జీ కసరబోయి విజయ్‌యాదవ్, నాయకులు గోగుల మల్లయ్య, బిరవెళ్లి యాదగిరిరెడ్డి, నందారపు రామచంద్రయ్య, వెన్నాకుల శ్రీనివాసు, వైస్ ఎంపీపీ గుగులోత్ శంకర్‌నాయక్, గొట్టిముక్కల ప్రభాకర్‌రెడ్డి, రామారావు, దాసరి ప్రకాశ్, మునిగంటి కుమార్, మండల అశోక్, జి.వినోద్‌రెడ్డి, గుండా వెంకన్న, దేశబోయిన శ్రీశేలం, మార్నెని వెంకన్న, పాల్వాయి రామోహన్‌రెడ్డి, ఆకుతోట సంతోశ్, కాలేరు శ్రీను, దర్శనం భిక్షపతి తదితరులు పాల్గొన్నారు.

127
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles