రాజకీయ లబ్ధికోసమే డబుల్‌పై రగడ

Mon,September 10, 2018 02:17 AM

బయ్యారం : మండలంలోని బాలాజీపేట, నామాలపాడు గ్రామాల్లో నిర్మించిన డబుల్ బెడ్‌రూంల విషయంలో విపక్షాలు రాజకీయ లబ్ధికోసమే అసత్య ఆరోపణలు చేస్తున్నారని మండల అధ్యక్షుడు మూల మధుకర్‌రెడ్డి, ఎంపీపీ గుగులోత్ జయశ్రీ అన్నారు. ఆదివారం మండల కేంద్రంలోని టీఆర్‌ఎస్ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. నాటి ఎమ్మెల్యే కోరం కనకయ్య చొరువతో మండలంలోని ఇసుకమేది, నామాలపాడు, బాలాజీపేట, రామచంద్రాపురం గ్రామాల్లో 80 ఇళ్లు మంజూరయ్యాయని వివరించారు. అందులో ఇసుకమేది, నామాలపాడు గ్రామాల్లో ప్రభుత్వ స్థలాలు ఉండగా రామచంద్రాపురం, బాలాజీపేట గ్రామాల్లో స్థలం లేకపోవటంతో గతంలోనే అధికారులు లబ్ధిదారులను ఎంపిక చేశారని లబ్ధిదారులే స్థలాలను కొనుగోలు చేసుకోగా ఇళ్ల నిర్మాణాలను చేపట్టారని వివరించారు. కానీ కొందరు లబ్ధిదారుల నుంచి డబ్బు వసూళ్లు చేశారంటూ టీఆర్‌ఎస్ నాయకుల పై తప్పుడు ప్రచారం చేస్తునారని అన్నారు. డబుల్ బెడ్ రూం నిర్మాణాల విషయంలో అక్రమాలకు పాల్పడ్డాట్లు నిరుపిస్తే రాజకీయాలో ్లనుంచి తప్పు కోవటానికి సిద్ధమని తెలిపారు. అందుకు బహిరంగ చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన శ్రీనివాస్ బాలాజీపేట ప్రజలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు. అంతేకాకుండా డబుల్ బేడ్ రూం నిర్మాణాలు తన స్థలంలో చేయాలని గతంలో శ్రీను కోరాడని సౌకర్యంగా లేక పోవటంతో లభ్థిదారుల కోరిక మేరకు తాము నిరాకరించామని తెలిపారు. అర్హులైన ప్రతి లబ్ధిదారుడికి ఇళ్లు ఇచ్చే బాధ్యత టీఆర్‌ఎస్‌దేనని అన్నారు. కార్యక్రమంలో ఎంపీటీసీ మంగీలాల్, గోపాల్, మాజీ సర్పంచ్ శ్రీనివాస్‌రావు, నాయకులు రెంటాల బుచ్చిరెడ్డి, ఆర్ నాగేశ్వరావు, సోమిరెడ్డి, రామరావు, రామ్మూర్తి, కిరణ్, నరేష్, తదితరులు పాల్గొన్నారు.

107
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles