పెండింగ్ కేసులు సత్వరమే పరిష్కరించాలి

Mon,September 10, 2018 02:16 AM

-డీఎస్పీ నరేశ్‌కుమార్
మహబూబాబాద్ క్రైం : పెండింగ్‌లో ఉన్న కేసులను జాప్యం చేయకుండా వెంటనే పరిష్కరించేందుకు పోలీసులు పనిచేయాలని మహబూబాబాద్ డీఎస్పీ ఆంగోత్ నరేశ్‌కుమార్ సూచించారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని టౌన్ పోలీసు స్టేషన్‌లో సబ్ డివిజన్ అధికారులతో ఆయన సమీక్ష న్విహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ రాష్ట్ర డీజీపీ ప్రణాళికల ప్రకారం పెండింగ్‌లో ఉన్న కేసులు సకాలంలో పూర్తి చేయాలని సూచించారు. నాణ్యమైన నేర దర్యాప్తు ఎలా ఉండాలి, అందులో పాటించాల్సిన అంశాలపై చర్చించారు. ఈ నెల 13న గణేశ్ నవరాత్రి వేడుకల సందర్భంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఉత్సవ కమిటీలు పాటించాల్సిన నియమాలు తెలిపారు. బలవంతపు చందాలు వసూలు చేయొద్దని, వివాదస్పద స్థలంలో విగ్రహాలు పెట్టరాదన్నారు. నిబంధనలు అతిక్రమిస్తే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

100
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles