బీసీలకు 54శాతం అసెంబ్లీ సీట్లు కేటాయించాలి


Mon,September 10, 2018 02:16 AM

మహబూబాబాద్ టౌన్ : ప్రస్తుత శాసన సభ ఎన్నికల్లో జనాభా దామాషా ప్రకారం అన్ని పార్టీలు స్వచ్ఛందంగా బీసీలకు 54శాతం సీట్లు కేటాయించాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు శంతన్ రామరాజు డిమాండ్ చేశారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద జాతీయ బీసీ సంక్షేమ సంఘం జిల్లా గౌరవ అధ్యక్షుడు గంగరబోయిన మల్లయ్య ఆధ్యక్షతన నిరసనలో శంతన్ రామరాజు మాట్లాడారు. అనంతరం తెలంగాణ ముస్లిం హక్కుల పోరాట సమితి రాష్ట్ర యువజన అధ్యక్షుడు ఎంఏ అజీమ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో మైనార్టీల హక్కుల కోసం పోరాటాలు చేస్తున్నట్లు తెలిపారు. అలాగే ముస్లింలకు 12శాతం రిజర్వేషన్ కల్పించాలన్నారు. కార్యక్రమంలో సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు బొద్దుల రంజిత్‌కుమార్‌నేత, కార్యదర్శి బోనగిరి ఉపేందర్, సహాయ కార్యదర్శి గుంజె హన్మంతు, జిల్లా యువజన నాయకులు పిట్టల శ్రీకాంత్, గాండ్ల కిరణ్ పాల్గొన్నారు.

96
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...