-వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్గెలువు ఖాయం
-200 కుటుంబాలు పార్టీలో చేరిక
-ఆహ్వానించినతాజా మాజీ ఎమ్మెల్యే కోరం కనకయ్య
బయ్యారం సెప్టెంబర్ 8 : ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే టీఆర్ఎస్కు శ్రీరామరక్ష అని మాజీ ఎమ్మెల్యే కో రం కనకయ్య అన్నారు. శనివారం మండలంలోని వెంకట్రాంపురం, బయ్యారంలోని ముస్తఫానగర్, శివాలయం వీధిలోని 200 కుటుంబాలు టీఆర్ఎస్లో చేరాయి. ఈ సందర్భంగా వారిని మాజీ ఎమ్మెల్యే కనకయ్య కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడు తూ దేశంలోని ఏ రాష్ట్రంలో లేని సంక్షేమ పథకాలను రాష్ట్రంలో అమలు చేస్తున్న ఘనత తెలంగాణ ప్రభుత్వానిదేనని అన్నా రు. రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజల అభ్యున్నత కోసం సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని అన్నారు. గిరిజనుల అభివృద్ధి కోసం తండాలను గ్రామ పంచాయతీలుగా మా ర్చారని, రైతులకు ఉచిత విద్యుత్, రైతు బంధు పథకాలను అమలు చేస్తున్నారని అన్నారు. కల్యాణలక్ష్మి, మిషన్ కాకతీయ, డబుల్బెడ్రూం, మిషన్‌భగీరథ వంటి ప లు సంక్షేమ పథకాలు చరిత్రలో చిరస్ధాయి గా నిలిచిపోతాయని వివరించారు. బంగా రు తెలంగాణ కోసం వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ను గెలిపించాలని ఆయన కోరారు.
అభివృద్ధి కోసమే టీఆర్ఎస్లోకి..
తమ గ్రామాల్ని అభివృద్ధి చేసుకోవాలనే సదుద్దేశంతోనే టీఆర్ఎస్లో చేరు తున్నట్లు కార్యకర్తలు తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పాటు నియోజక వర్గ మాజీ ఎమ్మెల్యే కోరం కనకయ్య చేస్తున్న అభివృద్ధికిని ఆకర్షితులై టీఆర్ఎస్లో చేరినట్లు తెలిపారు. కార్యక్రమంలో మండల అధ్యక్షు డు, వైస్‌ఎంపీపీ మూల మధుకర్‌రెడ్డి, ఎం పీపీ గుగులోత్ జయశ్రీ, మండల ప్ర ధాన కార్యదర్శి ఐలయ్య, ఎంపీటీసీ గోపా ల్, నాయకులు బుచ్చిరెడ్డి, నాగేశ్వరావు, శ్రీ ను, వెంకటేశ్వరావు, శ్రీకాంత్, రాం మ్మూ ర్తి, సోమిరెడ్డి, శ్రీను,రాజు,కృష్ణ తదితరు లు పాల్గొన్నారు.