కురవి ఆలయానికి నూతన ధర్మకర్తల నియామకం

Sun,September 9, 2018 01:56 AM

మరిపెడ, నమస్తేతెలంగాణ, సెప్టెంబర్ 08: కురవి వీరభద్రడి ఆలయానికి నూతన ధర్మకర్తల మండలిని నియమిస్తూ ఈ నెల 5న రాష్ట్రదేవాదాయశాఖ కమిషనర్ శివ శంక ర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఆ ఉత్తర్వులు శని వారం ఆలయ అధికారులకు శనివారం అం దాయి. చైర్మన్‌గా కురవి మండల కేంద్రానికి చెందిన సోమిశెట్టి శ్రీనివాస్‌ను నియమిస్తూ ఆ ఉత్తుర్వుల్లో పేర్కొన్నారు. ఆయనతో పా టు మరో 14మందిని ధర్మకర్తలుగా ప్రకటిం చారు. ప్రతాపని భిక్షమయ్య, మేక నాగిరెడ్డి, బానోత్ లక్ష్మీతుకారాం, బజ్జూరి వెంకట్‌రెడ్డి, పోగుల వెంకన్న, సీహెచ్ కందగిరి, తేజావత్ భిక్షం, ఇంజం శ్రీనివాస్, కొమ్ము ఉప్పల య్య, సలేంద్ర శ్రీనివాస్, గుగులోత్ సరోజ, బానోత్ వీరన్న, షాబాద్ వెంకటేశ్వర్లు ధర్మ కర్తలుగా నియమితులయ్యారు. అయితే ఈ నెల 26వరకు ప్రస్తుత ఆలయ పాలక మండ లి కొనసాగనుండడంతో 27వ తేదీ నుంచి నూతన పాలకవర్గం బాధ్యతలు చేపట్టేలా కమిషనర్ ఉత్తర్వుల్లో కమిషనర్ పేర్కొన్నా రు. అయితే గతంలో ఆలయ చైర్మన్ పదవులు జనరల్, ఎస్టీ వర్గాలకు దక్కేవి. ఈసారి ఎక్కువ జనాభా కలిగిన బీసీ కులాలకు దక్కడంతో శనివారం కురవిలో పటాకులు పేల్చి సంబురాలు జరుపుకున్నారు. సీఎం కేసీఆర్, తాజా మాజీ ఎమ్మెల్యే రెడ్యా నాయక్ చిత్రపటాలకు ఆయా వర్గాలు క్షీరాభిషేకం నిర్వహించాయి. కార్యక్రమంలో స్థానిక నాయకులు, బీసీ కుల సంఘాల బాధ్యులు పాల్గొన్నారు. నూతనంగా ఎంపికైన చైర్మన్ శ్రీనివాస్‌తో పాటు పాలకమండలి సభ్యులకు పలువురు అభినందనలు తెలిపారు.

113
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles