శాస్త్ర సాంకేతిక పరిశోధనలు


Sun,September 9, 2018 01:56 AM

-సమాజాభివృద్ధికి దోహదపడాలి
మహబూబాబాద్ రూరల్, సెప్టెంబర్ 08: శాస్త్ర, సాంకేతిక పరిశోధనలు, ఆవిష్కరణలు జాతి నిర్మాణానికి, సమాజ అభివృద్ధికి దోహదపడేలా విద్యార్థులను ప్రోత్సహించాలని కేయూ విశ్రాంత ఆచార్యులు రామేశ్వరం, జిల్లా విద్యాశాఖాధికారి సత్యప్రియ అన్నారు. మహబూబాబాద్‌లోని జిల్లాపరిషత్ బాలికోన్నత పాఠశాలలో జాతీయ బాలల సైన్స్ కాం గ్రెస్ 2018 లో భాగంగా ప్రధానాంశంగా పరిశుభ్ర హరిత, ఆరోగ్యకరమైన దేశం కోసం శాస్త్ర సాకేతిక ఆవిష్కరణలపై శనివారం ఉపాధ్యాయులకు ఒకరోజు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ము ఖ్య అతిథులుగా వారు హాజరై మాట్లాడారు. నిరంతర పరిశోధనలే నూ తన ఆవిష్కరణలకు దారి చూపుతాయన్నారు. విద్యార్థులను బాల్యం నుంచే పరిశోధకులుగా, భావిభారత శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దే గురుతర బా ధ్యత ఉపాధ్యాయులపై ఉందన్నారు. నిర్దిష్ట లక్ష్యాలతో విద్యార్థులు స్వే చ్ఛాపూరిత వాతావరణంలో సైన్స్ ప్రాజెక్టులు రూపొందించేలా ప్రతీ ఉపాధ్యాయుడు ప్రోత్సహించాలని సూచించారు.

అక్టోబర్‌లో నిర్వహించే జిల్లాస్థాయి జాతీయ బాలల సైన్స్ కాంగ్రెస్‌లో ప్రతీ పాఠశాల కనీసం ఒక ప్రాజెక్టుతోనైనా హాజరుకావాలని అన్నారు. జిల్లా ఎన్‌సీఎస్‌సీ కో ఆర్డినేటర్ వీ గరునాథరావు మాట్లాడుతూ అక్టోబర్ మొదటి వారంలో జిల్లాస్థాయి పోటీలు ఉంటాయని, ఈ పోటీల్లో సృజనాత్మకత, నూతనత్వం, స్థానిక సమస్యలపై రూపొందించిన ప్రాజెక్టులు ప్రదర్శించినట్లయితే జాతీయస్థాయి వరకు విద్యార్థులు వెళ్లే అవకాశం ఉందని అన్నారు. అనంత రం ఎన్‌సీఎస్‌సీ 2018 యాక్టివిటీ గైడ్, బ్రోచర్లను వారు ఆవిష్కరించా రు. కార్యక్రమంలో మహబూబాబాద్, తొర్రూరు రెవెన్యూ డివిజన్ పరిధిలోని 98పాఠశాలలకు చెందిన ఉపాధ్యాయులు పాల్గొన్నట్లు తెలిపారు. రిసోర్స్ పర్సన్లుగా రామేశ్వరం, గురునాథరావు వ్యవహరించారు. కార్యక్రమంలో డీఎస్‌వో అప్పారావు, ఎన్‌సీఎస్‌సీ అకాడమిక్ కో ఆర్డినేటర్ ఎస్ వెంకటేశ్వర్లు, పాఠశాల హెచ్‌ఎం ఎన్.కైలాసం, ఉపాధ్యాయులు రవికుమార్, వినయశీల పాల్గొన్నారు.

98
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...