గెలుపు గుర్రానికి ఘన స్వాగతం


Sun,September 9, 2018 01:55 AM

దంతాలపల్లి, సెప్టెంబర్ 08: డోర్నకల్ నియోజకవర్గ టీఆర్‌ఎస్ అభ్యర్థిగా ఎంపికైన తర్వాత తొలిసారిగా వచ్చిన డీఎస్ రెడ్యానాయక్‌కు మండలకేంద్రంలో శనివారం పార్టీ శ్రేణులు, నాయకులు డప్పుచప్పుళ్ళు, కోలాటాలతో ఘన స్వాగతం పలికారు. మహిళలు మంగళహారతులతో ఎదురువచ్చి విజయ తిల కం దిద్దారు. రెడ్యా తన వాహనం దిగడంతోనే అమితానందంతో కార్యకర్తలు ఆయనను అ మాంతం వారి భుజాలపైకి ఎత్తుకొని జయహో రెడ్యా, జై తెలంగాణ అంటూ నినాదాలతో హోరెత్తిస్తూ చిందులేశారు. వెంటనే రెడ్యా విజయశంఖం పూరించి పార్టీ నాయకులు దంతాలపల్లి నుంచి మరిపెడ వరకు ఏర్పాటు చేసిన భారీ బైక్ ర్యాలీని ప్రారంభించారు. ఈ ర్యాలీలో వేలాది ప్రజానీకం, వందలాది వాహనాలు పాల్గొన్నాయి. గెలుపు గుర్రానికి బ్రహ్మరథం పట్టిన అశేష జనవాహిని ప్రతి పక్షాల దిమ్మతిరిగి బిత్తర చూపులు చూసేలా చేసింది. కార్యక్రమంలో టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు నూకల వెంకటేశ్వర్‌రెడ్డి, ఎంపీపీ సంపెట సుజా త, జెడ్పీటీసీ ధర్మారపు వేణు, ఎంపీటీసీ వీరబోయిన కిశోర్, రైతు సమన్వయ సమితి మండల కో ఆర్డినేటర్ ఓలాద్రి మల్లారెడ్డి, పీఏసీఎస్ వైస్ చైర్మన్ మధుకర్‌రెడ్డి, జిల్లా నాయకులు సంపెట రాము తదితరులు పాల్గొన్నారు.

111
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...