దయన్నను ఆశీర్వదించండి

Sat,September 8, 2018 02:15 AM

-పాలకుర్తి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశారు
-ఎర్రబెల్లి చారిటబుల్ ట్రస్ట్ చైర్‌పర్సన్ ఉషాదయాకర్‌రావు
-మురళీకృష్ణ మందిరంలో ప్రత్యేక పూజలు
మహబూబాబాద్ జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ: నిత్యం పాలకుర్తి నియోజకవర్గ ప్రజల మధ్యే ఉంటూ కష్టసుఖాల్లో పాల్పంచుకుంటూ అన్ని విధాలా అభివృద్ధి చేస్తున్న ఎర్రబెల్లి దయాకర్‌రావును ప్రజలంతా ఆశీర్వదించాలని ఎర్రబెల్లి చారిటబుల్ ట్రస్టు చైర్మన్ ఉషా దయాకర్‌రావు కోరారు. స్థానిక శ్రీకృష్ణ మందిరంలో శుక్రవారం జరిగిన లక్ష కుంకుమార్చన పూజా కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా గౌరీమాతకు ప్రత్యేక పూజలు చేశారు. శత్రువుకు కూడా సాయం చేయాలన్న తత్వం కలిగిన వ్యక్తి దయాకర్‌రావు అన్నారు. ఓటమన్నదే లేకుండా విజయాలు సాధిస్తూ తనను నమ్ముకున్న ప్రజల శ్రేయస్సు కోసం నిరంతరం శ్రమిస్తున్నారన్నారు. తొర్రూరు పట్టణ అభివృద్ధికి ఆయన ప్రత్యేక కృషి చేశారన్నారు. అందరివాడైన దయన్నను నిండు మనస్సుతో ఆశీర్వదించాలని కోరారు. కార్యక్రమంలో మాజీ ఉప సర్పంచ్ దొంగరి రేవతి, మాజీ ఎంపీటీసీ పసుమర్తి శాంత, మాజీ వార్డు సభ్యురాలు భూసాని జయమ్మ, సుందర సత్సంగ్ మాతృ మండలి అధ్యక్షురాలు మాశెట్టి జమున, మహిళలు పాల్గొన్నారు.

80
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles