కేసీఆర్‌కు రుణపడి ఉంటా


Sat,September 8, 2018 02:14 AM

నెల్లికుదురు, సెప్టెంబర్ 07: మానుకోట నియోజకవర్గ ప్రజలకు సేవ చేసేందుకు మరో అవకాశం కల్పిస్తూ తనకు ఎమ్మెల్యే అభ్యర్థిగా టికెట్ కేటాయించిన సీఎం కేసీఆర్‌కు ఎల్లవేళలా రుణపడి ఉంటానని తాజా మాజీ ఎమ్మెల్యే బానోత్ శంకర్‌నాయక్ అన్నారు. ఎమ్మెల్యే అభ్యర్థిగా కేసీఆర్ ప్రకటించిన తర్వాత మొదటిసారి నియోజకవర్గానికి వచ్చిన తాజా మాజీ ఎమ్మెల్యే బానోత్ శంకర్‌నాయక్‌కు శుక్రవారం టీఆర్‌ఎస్ నాయకులు, ప్రజలు మండలంలోని కాచికల్ వద్ద ఘనంగా స్వాగతం పలికారు. అక్కడి నుంచి సుమారుగా 300 బైక్‌లపై తారసింగ్‌బావి వరకు ర్యాలీగా వెళ్లి శ్రీ అభయాంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అక్కడి నుంచి అంబేద్కర్ సెంటర్‌కు చేరుకుని అంబద్కేర్ విగ్రహానికి పూలమాల వేశారు. ఈ సందర్భంగా శంకర్‌నాయక్ మాట్లాడుతూ మానుకోట నియోజకవర్గ ప్రజలు తనను మళ్లీ దీవించి, భారీ మెజార్టీతో గెలిపించాలని వేడుకునారు. నియోజకవర్గంలో మళ్లీ గులాబి జెండాను ఎగరేసి కేసీఆర్‌కు కానుకగా ఇవ్వాలని ప్రజలను కోరారు. టీఆర్‌ఎస్‌కు పట్టం కట్టి మన ఆత్మగౌరవాన్ని చాటుకుందామన్నారు. ప్రజలంతా తనను దీవిస్తే మరోసారి సేవకున్నై రుణం తీర్చుకుంటానని, మానుకోటను బంగారుకోటగా మారుస్తానని అన్నారు. గ్రామాల్లో టీఆర్‌ఎస్ కార్యకర్తలు, నాయకులు సైనికుల్లా పనిచేసి కారు గుర్తుకు ఓటు వేసి 50వేల మెజార్టీతో తనను గెలిపించాలని కోరారు. కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటానని అన్నారు. 2014లో ఇదే శ్రీ అభయాంజనేయస్వామి ఆలయం నుంచి ప్రచార పర్వాన్ని ప్రారంభించి సత్ఫలితాన్ని పొందానని, మళ్లీ ఇదే ఆలయం నుంచి ప్రారంభిస్తున్నానని ఆయన తెలిపారు. కార్యక్రమంలో రైతు సమన్వయ సమితి జిల్లా కోఆర్డినేటర్ భూక్యా బాలాజీనాయక్, టీఆర్‌ఎస్ మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు గుగులోత్ బిక్కునాయక్, యాసం రమేశ్, రైతు సమన్వయ సమితి మండల కోఆర్డినేటర్ కాసం వెంకటేశ్వర్‌రెడ్డి, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ పరుపాటి వెంకట్‌రెడ్డి, మీడియా ఇన్‌చార్జి కసరబోయిన విజయ్‌యాదవ్, నాయకులు ఆకుల జగ్గయ్య, గోగుల మల్లయ్య, నందారపు రామచంద్రు, మంద అశోక్, వంశీ, గొట్టిముక్కుల ప్రభాకర్‌రెడ్డి, వెన్నాకుల శ్రీనివాస్, వినోద్‌రెడ్డి, రాజిరెడ్డి, రామారావు, మహేందర్, గుండా వెంకన్న, కదిర జగన్, దర్శనం భిక్షపతి, నాగరాజు, హనుమానాయక్ పాల్గొన్నారు.

96
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...