శంకర్‌నాయక్‌కు ఘన స్వాగతం

Sat,September 8, 2018 02:14 AM

మహబూబాబాద్ టౌన్, సెప్టెంబర్ 07: మహబూబాబాద్ నియోజకవర్గ టికెట్ ఖరారైన తర్వాత శుక్రవారం తొలిసారిగా పట్టణానికి చేరుకున్న తాజా మాజీ ఎమ్మెల్యే బానోత్ శంకర్‌నాయక్‌కు ఘన స్వాగతం లభించింది. టీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు, శ్రేణులు ఆయనకు ఎదురేగి పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. సీఎం కేసీఆర్ బానోత్ శంకర్‌నాయక్‌కు మరోసారి అవకాశం కల్పించడం ఆనందంగా ఉందని పార్టీ శ్రేణులు సంబురపడుతున్నారు. స్థానిక ఫాతిమా స్కూల్ వద్దకు నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చి ఆయనకు స్వాగతం తెలిపారు. శంకర్‌నాయక్ నేరుగా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు. అనంతరం స్థానిక అంబేద్కర్ విగ్రహం వద్దకు వెళ్లి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అలాగే, పక్కనే ఉన్న తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద అమరవీరులకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా తెలంగాణ అమరవీరులకు జోహార్లు అంటూ టీఆర్‌ఎస్ శ్రేణులు జోరుగా నినాదాలు చేశారు. తదనంతరం శంకర్‌నాయక్ ముత్యాలమ్మ దేవస్థానానికి చేరుకొని అమ్మవారికి పూజలు నిర్వహించారు. జై తెలంగాణ.. జై కేసీఆర్ అంటూ నినదించారు. తర్వాత ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో టీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు బానోత్ శంకర్‌నాయక్‌కు పూలబొకేలు అందజేసి, స్వీట్లు తినిపించి ఆనందం వ్యక్తం చేశారు.

కేసీఆర్‌కు రుణపడి ఉంటా..
మహబూబాబాద్ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు తనకు మరోసారి అవకాశం కల్పించిన సీఎం కేసీఆర్‌కు జీవితాంతం రుణపడి ఉంటానని శంకర్‌నాయక్ అన్నారు. తనకు టికెట్ వచ్చేందుకు సహకరించిన ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరికి కృతజ్ఞతలు తెలిపారు. మరోసారి కేసీఆర్‌ను సీఎం చేద్దామని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్ సీనియర్ నాయకులు డాక్టర్ పాల్వాయి రామ్మోహన్‌రెడ్డి, మార్నేని వెంకన్న, దార యాదగిరిరావు, సుదగాని మురళి, డోలి లింగుబాబు, ఎండీ ఫరీద్, పొనుగోటి రామకృష్ణారావు, గడ్డం అశోక్, భూక్యా ప్రవీణ్, నీలేశ్‌రాయ్, తేళ్ల శ్రీనివాస్, చిట్టోజు రవీంద్రాచారి, లూనావత్ అశోక్, చిట్యాల జనార్దన్, గోగుల రాజు, పెద్ది సైదులు, దామునాయక్, సోమ్లానాయక్, ఉప్పలయ్య, చెట్ల జయశ్రీ, భూక్యా లక్ష్మి, పద్మం ఉపేంద్రమ్మ, మెప్మా మహిళలు సుమలత, రజియా, రమ తదితరులు పాల్గొన్నారు.

ఎమ్మార్పీఎస్ టీఎస్ ఆధ్వర్యంలో..
మానుకోటకు వచ్చిన బానోత్ శంకర్‌నాయక్‌కు ఎమ్మార్పీఎస్ టీఎస్ జిల్లా కమిటీ, కేటీఆర్‌కాలనీ ఆధ్వర్యంలో ఘనంగా స్వాగతం పలికారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్ నియోజకవర్గ అధికార ప్రతినిధి మార్నేని రఘు, ఎమ్మార్పీఎస్ టీఎస్ జిల్లా అధ్యక్షుడు కొండ్ర ఎల్లయ్య, టీఆర్‌ఎస్ పట్టణ కార్యదర్శి భూక్యా ప్రవీణ్, గడ్డం అశోక్, కాలనీవాసులు ముప్పు గుట్టయ్య, దూదికట్ల వెంకటాచారి, సాంబశివరావు, రాజు, సందీప్, బాలకృష్ణ, సీహెచ్ రవి, మహిళా నాయకులు గోనె భాగ్యమ్మ, సీహెచ్ రాధ, కుక్కల సుధారాణి, యశోద, రుక్కమ్మ, జ్యోతి, ధనమ్మ తదితరులు పాల్గొన్నారు.
మహబూబాబాద్ రూరల్: బానోత్ శంకర్‌నాయక్‌కు టీఆర్‌ఎస్ శ్రేణులు మండలంలోని అమనగల్ శివారులో స్వాగతం పలికారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ సుదగాని మురళీగౌడ్, మండల ప్రధాన కార్యదర్శి చిట్టోజు రవీంద్రాచారి, రైతు సమన్వయ సమితి మండల కో ఆర్డినేటర్ తేళ్ల శ్రీనివాస్, సీనియర్ నాయకులు దార యాదగిరిరావు, బూర్ల ప్రభాకర్‌గౌడ్, గంధం ఉప్పలయ్య పాల్గొన్నారు.

115
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles