అంధత్వ రహిత తెలంగాణే ధ్యేయం

Sat,September 8, 2018 02:14 AM

పెద్దవంగర, సెప్టెంబర్ 07: అంధ త్వ రహిత తెలంగాణే సీఎం కేసీఆర్ ధ్యే యమని తాజా మాజీ ఎమ్మెల్యే ఎర్రబె ల్లి దయాకర్‌రావు అన్నారు. మండలంలోని శ్రీరాం అప్పయ్య స్మారక కమ్యూనిటీ భవనంలో శుక్రవారం ప్రారంభమైన కంటి వెలుగు కార్యక్రమాన్ని ద యాకర్‌రావు, జీసీసీ చైర్మన్ ధరావత్ మోహన్‌గాంధీనాయక్ పరిశీలించారు. అనంతరం దయాకర్‌రావు మాట్లాడు తూ ఏ రాష్ట్రంలో లేని విధంగా టీఆర్‌ఎస్ ప్రభుత్వం కంటి వెలుగు పథకాన్ని అమలు చేయడం హర్షనీయమన్నా రు. పరీక్షలు చేసి దృష్టిలోపం ఉన్నవారికి ఉచితంగా అద్దాలు పంపిణీ చేయ డంతోపాటు, అవసరమైన వారికి పైసా ఖర్చు లేకుండా ఆపరేషన్లు చేయడం జరుగుతుందన్నారు.ప్రభుత్వం సర్కార్ దవాఖానల్లో కార్పొరేట్ స్థాయి సౌకర్యాలను కల్పించిదన్నారు. ఆరోగ్య శ్రీ పథకం ద్వారా ప్రభుత్వం వైద్య ఖ ర్చు లను అందించడం జరుగుతుందన్నా రు. కంటి చూపు సక్రమంగా ఉన్నంత కాలం దాని ప్రాధాన్యత తెలియదని, అ ది లేనప్పుడు మాత్రమే తెలిసి వస్తుందన్నారు. సుమారు 180 రోజుల పాటు నిర్వహించనున్న కంటి వెలుగు వైద్యశిబిరాల వద్ద వయోభేదం లేకుం డా అందరూ తమ కళ్లను పరీక్షించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో తహసీల్దార్ గౌరీశంకర్, వైద్య సిబ్బం ది, పాలకుర్తి దేవస్థాన చైర్మన్ రామచంద్రయ్యశర్మ, ఎంపీపీ జ్యోతి, ఎంపీటీసీ బక్కమ్మ, మాజీ సర్పంచ్ జ్యోతిర్మయి, టీఆర్‌ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు ఐలయ్య, టీఆర్‌ఎస్ నాయకులు సోమనర్సింహరెడ్డి, సుధీర్, జగదీష్, సంజ య్, బండారి వెంకన్న, లింగమూర్తి, చంద్రశేఖర్‌నాయక్, మనోహర్, బం దు వెంకన్న, అశోక్, వివిధ గ్రామాల మాజీ సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, టీఆర్‌ఎస్ కార్యకర్తలు, ఆశ కార్యకర్తలు, అంగన్‌వాడీ టీచర్లు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

89
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles